మహానటి సర్దేసింది

Keerti Suresh upcoming movies

గత నెలన్నర నుండి మహానటి పేరు మాములుగా మర్మోగడం లేదు. మహానటి మూవీ మే 9 న విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోయింది. మహానటి సినిమా విడుదలయ్యాక మళ్ళి అలాంటి సినిమా ఇంతవరకు థియేటర్స్ లోకి దిగలేదంటే నమ్మాలి. మధ్యలో అభిమన్యుడు కోలీవుడ్ సినిమా, సుధీర్ బాబు ల సమ్మోహనం మూవీ లు బావున్నా కలెక్షన్స్ అంతంత మాత్రంగా ఉంటూ.. ఈ నెలన్నరలో భారీ బడ్జెట్ సినిమాలేవీ లేకపోవడంతో మహానటి మూవీకి ఎదురులేకుండా పోయింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సావిత్రి జీవిత కథను కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో అందరికి అంటే చిన్న పెద్ద కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటికే తన కలెక్షన్స్ క్లోజ్ చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మహానటి దాదాపుగా 44 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా మహానటి కలెక్షన్స్…

 

ఏరియా: క్లోజింగ్ షేర్స్ కోట్లలో
నైజాం 11.09
సీడెడ్ 02.85
ఉత్తరాంధ్ర 03.87
గుంటూరు 02.13
కృష్ణ 02.38
తూర్పు గోదావరి 02.45
పశ్చిమ గోదావరి 01.62
నెల్లూరు 00.09

టీఎస్ అండ్ ఏపీ షేర్స్ 28.01 కోట్లు
ఓవర్సీస్ 11.02
కర్ణాటక 02.25
ఇతర ప్రాంతాలు 02.05

టోటల్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ 44.05 కోట్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*