అయ్యగారి క్రేజ్ పనిచెయ్యలా

అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ ఉంది. అందుకే ‘సరైనోడు’ యావరేజ్ కంటెంట్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే అల్లు అర్జున్ క్రేజ్ తోనే ‘డీజే దువ్వాడ జగన్నాథం’ కూడా యావరేజ్ హిట్ కాస్తా సూపర్ హిట్ అవడమే కాదు… అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోయింది. మరి ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ కి టాక్ గొప్పగా ఏమి లేదు. కేవలం టాకే కాదండోయ్ కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అసలు ‘నా పేరు సూర్య’ కలెక్షన్స్ చూస్తుంటే అల్లు అర్జున్ క్రేజ్ పని చెయ్యడం లేదనేది ప్రస్తుత చర్చ. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ లో ఆర్మీ జవాన్ గా అద్భుతమైన నటన కనబర్చాడు.

కానీ డైరెక్షన్ కి కొత్త అయినా వక్కంతం చేసిన చిన్న తప్పిదాలవలన సినిమాకి కాస్త యావరేజ్ టాక్ పడింది. ఆ యావరేజ్ టాక్ కి తగ్గట్టే కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ మ్యాజిక్, క్రేజ్ ఏమాత్రం ‘నా పేరు సూర్య’ కలెక్షన్స్ ని నిలబెట్టలేకపోతున్నాయి. అసలు ‘నా పేరు సూర్య’ ఫ్యామిలీస్ కి పెద్దగా ఎక్కని కంటెంట్ కావడంతో అసలు చిక్కొచ్చి పడింది. ‘నా పేరు సూర్య’ కి ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కావడం లేదు. అలాగే రిపీట్ ఆడియన్స్ కూడా లేకపోవడం మైనస్ గా మరింది. అసలు ఈ సినిమా అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌ చాలా సీరియస్‌గా వుండడం దగ్గరనుండి యాక్షన్‌ సీన్స్ శృతి మించడంతో పాటు ప్రస్తుతం కొన్ని థియేటర్స్ లో రెండు హిట్‌ సినిమాలుండడం కూడా ‘నా పేరు సూర్య’ కి ప్రతికూలంగా మారింది.

ఇక ఇప్పుడు ‘నా పేరు సూర్య’ కి మరో అడ్డంకి ‘మహానటి’ మూవీ. ‘మహానటి’ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో రేపు మే 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహానటి హిట్ టాక్ వచ్చినా రాకపోయినా కలెక్షన్స్ మాత్రం బావుంటాయి. ఎందుకంటే ఈ కాలం వాళ్ళకి సావిత్రి గురించిన సమాచారం ఏం తెలియదు. అలాగే సినిమా టాక్ ఎలా వున్నా సినిమాలో నటించిన స్టార్ కాస్ట్ పని తీరు గురించి అయినా సినిమా ని ఒక్కసారి ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉంది. మరి మహానటి సినిమా థియేటర్స్ లోకి దిగడమే తరువాయి అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ హావా ఆటోమాటిక్ గా ముగియడం ఖాయమంటున్నారు. మరి అల్లు అర్జున్ కి ఇది జీర్ణించుకోలేని విషయమైనా మోయక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*