డీల్ క్లోజ్‌: రికార్డు రేటుకు మ‌హాన‌టి శాటిలైట్ రైట్స్‌

Keerti Suresh upcoming movies

దివంగ‌త లెజెండ్రీ హీరోయిన్ మ‌హాన‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప్ర‌భంజనంతో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే రూ.20 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో పెద్ద సినిమాల‌కే సాధ్యం కాని రీతిలో 2 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసి 2.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌కు చేరువ అవుతోంది. ఈ సినిమా నైజాంలో 11 రోజుల‌కు రూ. 7 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

11వ రోజు రెండో వీకెండ్‌లో కూడా ఏకంగా రూ. 68 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టింది అంటే వ‌సూళ్లు ఎంత స్ట‌డీగా ఉన్నాయో తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా ఆడుతున్న అన్ని థియేట‌ర్లు హౌస్‌ఫుల్ బోర్డుల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. వ‌చ్చే వారం ర‌వితేజ నేల‌టిక్కెట్ వ‌చ్చే వ‌ర‌కు ఈ సినిమాకు బ్రేకులు ప‌డే ఛాన్సులు లేవు.

ఇక ఈ రికార్డుల ప‌రంప‌ర‌ను మ‌హాన‌టి కంటిన్యూ చేస్తోంది. తాజాగా మ‌హాన‌టి సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ అయ్యింది. దిమ్మ‌తిరిగిపోయే రేటుకు జీ ఛానెల్ ఈ రైట్స్ సొంతం చేసుకుంది. మ‌హాన‌టి శాటిలైట్ హక్కులను రూ. 18 కోట్లు వెచ్చించి జీ టీవీ దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు అయిన ఖ‌ర్చు శాటిలైట్ రైట్స్ రూపంలో వ‌చ్చేయ‌డంతో ఈ సినిమా థియేట్రిక‌ల్ వ‌సూళ్లు అన్ని వైజ‌యంతీ మూవీస్ వారికి భారీ లాభాల‌ను తెచ్చిపెట్ట‌నున్నాయి. అశ్వ‌నీద‌త్ ఓన్ రిలీజ్‌కు వెళ్ల‌డం కూడా చాలా ప్ల‌స్ అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*