ఆకట్టుకుంటున్న మహేష్ బాబు పోస్టర్
ఒక్కప్పుడు సినిమా ప్రొమోషన్స్ పేపర్ లో.. లేదా వాల్ పోస్టర్స్ ద్వారా ప్రమోట్ చేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ప్రొమోషన్స్ బీభత్సంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గోడ మీద పోస్టర్స్ ఉండే క్రేజ్ వేరు. అప్పట్లో హీరో ఉన్న పోస్టర్స్ గోడ మీద ఉంటె పాలాభిషేకం తో పాటు దండలు కూడా పడేవి.
రోడ్ మీద వెళ్లే జనాలు ఆగిమరీ ఆ పోస్టర్స్ ను చేసేవారు. అయితే ఈ రోజుల్లో ఎక్కువగా పోస్టర్స్ కనిపించడం లేదు. హోర్డింగ్స్ లేదా కటౌట్స్ మాత్రమే కొంచెం ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే కొరటాల - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను పోస్టర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా బాగానే కనపడుతున్నాయి.
ఈ సినిమా నుండి బయటికి వచ్చిన ఒక పోస్టర్ మాస్ ప్రేక్షకులకి నచ్చే విధంగా ఉంది. మహేష్ బాబు సోడా తాగుతూ సింపుల్ గా కనిపించాడు. ఫ్యాన్స్ ఆ పోస్టర్ చాలా కనెక్ట్ అయ్యిపోయారనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఆ పోస్టర్ కు కేక..సూపర్బ్.. అని కామెంట్స్ వేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ దానయ్య ప్రమోషన్స్ కోసం దాదాపు 3 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అంటే ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.