మహేష్ ఇంట్రో కోసం తమన్నా?

తమన్నా భాటియా

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. ఈచిత్రం షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. అలనాటి నటి విజయశాంతి ఇందులో ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. అంతే కాదు ఈసినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు అనిల్ మరో ప్లాన్ వేసాడు.

మహేష్ పక్కన తమన్నా….

ఓ సాంగ్ కోసం మిల్క్ బ్యూటీ తమన్నా ను తీసుకున్నారు. అది కూడా మహేష్ బాబు ఇంటర్ డక్షన్ సాంగ్ కు తమన్నాను తీసుకోవడం విశేషం. ఇందులో మహేష్ ఇంటిలిజెన్స్ అధికారి అని అందరికి తెలిసిందే. అందుకే మహేష్ పక్కన ఈ బ్యూటీ అయితే బాగుంటుందని తీసుకున్నారు. సంక్రాంతికి రానున్న మూవీ ఇప్పటివరకు తమన్నా రెండు మూడు స్పెషల్ సాంగ్స్ చేసింది. అన్నిసాంగ్స్ హిట్ అయ్యాయి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు లో చేస్తుంది. మహేష్ – తమన్నా కాంబినేషన్ లో ఆగడు సినిమా వచ్చింది. ఇప్పుడు రెండోసారి వీరిద్దరూ స్టెప్స్ వేయనున్నారు. శృతి హాసన్ నా? తమన్నానా? అనుకుని చివరికి తమన్నానే ఫైనల్ చేసారు. సంక్రాంతికి ఈమూవీ రిలీజ్ కానుంది.

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*