మహేష్ మళ్లీ అదే పాత్ర చేస్తున్నాడు

Gattamaneni Mahesh babu in maharshi movie telugu post telugu news

‘భరత్ అనే నేను’ లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో మహేష్ కోటీశ్వరుడిగా నటిస్తున్నాడట. మహేష్ కు అమెరికాలో ఒక కంపెనీ ఉంటది దానికి మహేషే సి.ఈ.ఓ .

అమెరికా లో ఉన్న మహేష్ కు తన ఫ్రెండ్ ద్వారా ఇండియా లో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుస్తుంది. వెంటనే మహేష్ అక్కడ నుండి ఇండియా కి వచ్చి ఇక్కడ రైతులు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం లో ఎలాంటి పరిస్థితులని ఎదురుకోవాల్సి వచ్చింది అనేది కథట. వంశీ స్క్రీన్ ప్లే ను బాగా తీర్చిదిద్దాడని తెలుస్తుంది.

వాస్తవానికి మహేష్ “శ్రీమంతుడు” సినిమాలో కూడా కోటీశ్వరుడిగా నటించాడు. కొన్ని కారణాల వల్ల ఒక ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరిని బాగుచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అటువంటి రోల్ నే మహేష్ మహర్షి లో నటిస్తున్నాడు. మహేష్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న ఈసినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు . దిల్ రాజు .. పీవీపీ.. అశ్విని దత్ ముగ్గురు కలిసి ఈసినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈమూవీ ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*