మహేష్ కు చరణ్ హామీ ఇస్తున్నాడు

మూడు గంటలు సేపు సినిమా హాల్ లో కూర్చోవాలంటే ఆ సినిమాలో అంతటి కంటెంట్ ఉంటే తప్ప కూర్చోలేం. పోయిన ఏడాది అర్జున్ రెడ్డి సినిమాతో మూడు గంటలు ఏంటి మూడున్నర గంటలు కూడా కూర్చోమన్న కూర్చుంటాం అని ప్రూవ్ చేసారు ప్రేక్షకులు. రంగస్థలం సినిమా కూడా దాదాపు మూడు గంటలు అయితే.. సినిమా రిలీజ్ అయ్యాక కొంత కత్తెర వేయాల్సి వస్తుందేమో అన్న ప్రీ రిలీజ్ అనుమానాలను పటాపంచలు చేశారు ప్రేక్షకులు.

అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ రావడంతో సుకుమార్ టీం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఎంత వ్వవధి ఉన్న చూస్తామని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేసారు. లెంగ్త్ ఎక్కువ ఉన్న సినిమాలు హిట్ అయినా సందర్భాలు టాలీవుడ్ లో కొత్త ఏమి కాదు. ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ.. త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్స్ మూవీస్ తో ప్రూవ్ చేసారు ప్రేక్షకులు. ఇంకా అసలు విషయానికి వస్తే మహేష్ భరత్ అనే నేను సినిమా కూడా రన్ టైం ఎక్కువే అని తెలుస్తుంది.

మహేష్ బాబు ముఖ్య మంత్రిగా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మాటల్లో చెప్పడం కష్టం. కాకపోతే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రం కాబ్బటి లెంగ్త్ ఇది కూడా సుమారు మూడు గంటల దాకా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఎడిటింగ్ కు అవకాశం లేకుండా డైరెక్టర్ కొరటాల ప్రతి సీన్ అవసరమే అనిపించేలా తీర్చిదిద్దాడట. దీంతో ముందుగా వచ్చిన రంగస్థలం సినిమా రన్ టైం విషయంలో కంటెంట్ బాగుంటే జనాలు కచ్చితంగా చూస్తారని చరణ్ హామీ ఇవ్వడంతో భరత్ అనే నేను ప్రొడ్యూసర్ దానయ్య తో పాటు కొరటాల కూడా లెంగ్త్ విషయంలో కంగారు పడటంలేదంట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*