రాజసమా.. రైతు బిడ్డా…?

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు

మహేష్ 25 వ సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం అయ్యింది కానీ.. మొదలు పెట్టగానే విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది. వంశి పైడిపల్లి పూర్తి స్క్రిప్ట్ తో మహేష్ – పూజ హెగ్డేలతో పాటుగా ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్న అల్లరి నరేష్ తో సహా సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ తో డెహ్రాడూన్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో మహేష్ 25 మూవీ టీం ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ముగ్గురు మహా మహులు ఈసినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్ తో కాలేజ్ స్టూడెంట్ లా కనిపిస్తాడట.. అల్లరి నరేష్, మహేష్ బాబు స్నేహితులుగా నటిస్తున్నారు… అలాగే లేటెస్ట్ గా ఈ సినిమాలో రైతు సమస్యలను చూపించబోతున్నారనే కథలు ప్రచారం లో ఉన్నాయి.

అలాగే పూజ హెగ్డే ఈ సినిమాలో సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా ఒక వీడియో గేమ్ తయారు చేసే అమ్మాయిలా కనిపించబోతుందనే ప్రచారము ఉంది. ఇంకా ఈ సినిమా టైటిల్ గా రాజసం అనే టైటిల్ ప్రచారంలో ఉండగా… కొత్తగా ప్రచారం జరుగుతున్న న్యూస్ కి అంటే మహేష్ మూవీ రైతు సమస్యలపై వంశి పైడిపల్లి తీసే ఎపిసోడ్ తో ఈ సినిమాకి కొత్తగా… రైతు బిడ్డ అనే టైటిల్ వాడుకలోకి వచ్చింది. ఇక రైతు సమస్యల బ్యాగ్డ్రాప్ అనేది మహేష్ కేరెక్టర్ కి సంబందించినదో.. లేదంటే.. అల్లరి నరేష్ కి సంబందించిందో తెలియదు గాని..ఈ సినిమాకి రైతు బిడ్డ అనే టైటిల్ మాత్రం పెడతారనే ఒక గాసిప్ మొదలైంది. మరి మహేష్ 25 వ సినిమా టైటిల్ రాజసం అవుతుందా… లేదంటే రైతు బిడ్డ అవుతుందా.. లేదంటే… మరో టైటిల్ బయటికొస్తుందో అప్పుడే చెప్పడం కష్టం.

ఇకపోతే మహేష్ – వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయాలేమి దర్శకుడు వంశి బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపోతే ఈ సినిమా సంక్రాతి రేస్ నుండి తప్పుకుని ఏప్రిల్ 5 కి షిఫ్ట్ అయ్యింది. ఉగాది కానుకగా మహేష్ – పూజ హెగ్డే ల సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ తనదైన స్టయిల్లో మ్యూజిక్ అందిస్తున్నాడు అని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*