మహేష్ 50 తీసుకుంటే అనిల్ ఎంతో తెలుసా?
పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి లేటెస్ట్ గా వెంకీ – వరుణ్ ల ఎఫ్ 2 అనే [more]
పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి లేటెస్ట్ గా వెంకీ – వరుణ్ ల ఎఫ్ 2 అనే [more]
పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి లేటెస్ట్ గా వెంకీ – వరుణ్ ల ఎఫ్ 2 అనే చిత్రం తీసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడం వెంటనే మహేష్ పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈసినిమా మరో మూడు నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈసినిమా కోసం మహేష్ షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అక్షరాలా 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. అయితే మహేష్ తీసుకునేది డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ని తన పారితోషికంగా తీసుకుంటున్నాడు. హీరో అంత తీసుకుంటే డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నాడు?
అతను కూడా అక్షరాలా 9 కోట్ల రూపాయలు. ఎఫ్2 సినిమాకి అనిల్ రావిపూడికి ముట్టింది నాలుగు కోట్లు. ఇప్పుడు పెద్ద హీరో సినిమా కాబట్టి ఎక్కడ తగ్గకుండా ఏకంగా 9 కోట్ల రూపాయలు తీసుకుని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అనిల్ చెప్పిన కథ నచ్చడంతో అనిల్ సుంకర ఓకే చేసాడు. అందుకే అనిల్ ఎంత అడిగిన సుంకర ఇచ్చేయడానికి రెడీ గా ఉన్నాడు.