మహేష్ – సుక్కు కలిసి..!

sukumar film with mahesh babu

మహేష్ బాబు తో సినిమాలు తియ్యాలనే దర్శకులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. కానీ సూపర్ స్టార్ మహేషే ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. ఎంత స్టార్ డైరెక్టర్ అయినా కథ నచ్చకపోతే పక్కన పెట్టేస్తాడు మహేష్. గతంలో పూరి తాజాగా సుకుమార్, వంశి పైడిపల్లి కి ఇలానే అయ్యింది. అయితే ఒకసారి పక్కనబెట్టిన దర్శకుడితో మహేష్ మళ్ళీ సినిమా చెయ్యలేదు. అంటే పూరికి మహేష్ కి మధ్యన కథ తేడా కొట్టిన తర్వాత మహేష్ మళ్ళి పూరి తో సినిమా చెయ్యలేదు. తాజాగా సుకుమార్ కథని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

అయితే సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తోనూ కమిట్ అవ్వలేదు.. కానీ త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ ఉండొచ్చనే హింట్ ఇచ్చాడు. తాజాగా మహేష్ సుకుమార్ తో మీట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. సుకుమార్ తో క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వలన సినిమా ఆపేసినట్లుగా ట్వీట్ చేసిన మహేష్ తర్వాత మళ్ళీ చాలా రోజులకి సుకుమర్ తో మహేష్ టచ్ లోకి రావడం అంటే.. వారి కాంబో లో మూవీ త్వరలోనే ఉండొచ్చనే ఊహాగానాలకు తెర లేపాయి. మహేష్ కి ఓ కథ నచ్చక తనతో సినిమా ఆపేసినా.. సుకుమార్ మాత్రం లాక్ డౌన్ టైమ్ లో ఖాళీగా ఉండడమెందుకు అని మహేష్ కోసం ఓ లైన్ రెడీ చేసి పెట్టుకున్నాడట. పుష్ప తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా కమిట్ అయిన సుక్కు తన తదుపరి చిత్రానికి మహేష్ ని లైన్ లోకి తేబోతున్నాడనే టాక్ మొదలయ్యింది.

Ravi Batchali
About Ravi Batchali 32328 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*