‘మన్మధుడు 2’ వచ్చేస్తోంది..!

మన్మధుడు 2 Akkineni Nagarjuna manmadhudu 2

`మ‌న్మ‌ధుడు` సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మ‌రో ఎంట‌ర్‌టైన‌ర్ `మ‌న్మ‌ధుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌(జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న `మ‌న్మ‌థుడు 2` నేడు లాంఛ‌నంగా అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. చిత్ర యూనిట్‌తో పాటు అక్కినేని అమ‌ల‌, నాగ‌చైత‌న్య ముఖ్య అతిథులుగా ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు. అమ‌ల అక్కినేని ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా.. అక్కినేని నాగ‌చైత‌న్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ యూర‌ప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్నారు. `RX100` ఫేమ్ చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*