మెహ్రీన్ ఏంటమ్మా ఆ స్పీడ్!

మెహ్రీన్ కౌర్

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో మెహ్రీన్ ఒక్కరు. ఆమె ఒక నటనతోనే కాదు గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటివరకు మీడియం సినిమాలకే పరిమితం అయిన ఈ సుందరికి వెంకటేష్ – వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ లో ఛాన్స్ కొట్టేసింది.

నోటా సినిమాలో…

అంతేకాకుండా గోపీచంద్ తో ‘పంతం’…విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న ‘నోటా’ సినిమాలోనూ నటిస్తోంది. ఇలా వరస ప్రాజెక్ట్స్ పై సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడి చేతిలోకి మరో ఆఫర్ వచ్చి పడింది. యంగ్ హీరో నితిన్ కు జోడీగా చేసే ఛాన్స్ అమ్మడికి దక్కడం విశేషం.

తర్వాత నితిన్ తో….

ప్రస్తుతం హీరో నితిన్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు అరవై శాతం కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీలో నితిన్ కు జోడిగా రాశీ కన్నా చేస్తుంది. ఈ సినిమా తర్వాత నితిన్ ‘ఛలో’ సినిమాను తీసిన వెంకీ కుడుములతో ఒక సినిమాను ఒకే చేసాడు. ఆ మూవీలో హీరోయిన్ మెహ్రీన్ అయితే బాగుంటాదని భావించి ఆమెను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇలా వరస సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉంది మెహ్రీన్.

Ravi Batchali
About Ravi Batchali 40437 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*