సుకుమార్ అనుకుంటే.. అతడు బుక్కయ్యాడే

allu arjun gap with producers

నిన్నటివరకు సుకుమార్ చెప్పిన కథకు అల్లు అర్జున్ ఇంకా కనెక్ట్ కాలేదని, అందుకే సుకుమార్ – అల్లు అర్జున్ ల కాంబోలో తెరకెక్కబోయే సినిమా దసరాకి ఓపెనింగ్ చేసుకోలేదని ప్రచారం జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద నడిచే స్టోరీ తో అల్లు అర్జున్ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. స్టోరీ డెవెలెమెంట్ లో సుకుమార్ తడబడుతున్నాడని, స్టోరీ లైన్ ఓకే గాని, పూర్తి స్క్రిప్ట్ తో సుకుమార్, అల్లు అర్జున్ ను మెప్పించలేకపోతున్నాడని అన్నారు. ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా సెట్స్ మీద కెళ్ళి పోతాడననుకున్నారు.

ముహూర్తం ఈరోజే….

ఎందుకంటే వేణు శ్రీ రామ్ చెప్పిన కథకి అల్లు అర్జున్ ఇంప్రెస్స్ అవడమే కాదు…. ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఎప్పుడో బయటికొచ్చేసింది. సుకుమార్ సినిమాని పక్కన బెట్టి అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ ఐకాన్ మొదలెడతాడు అనుకుంటున్న టైం లో అందరికి షాకిస్తూ సుకుమార్ సినిమాని ఈ రోజు మొదలుబెట్టబోతున్నాడు. అల్లుఅర్జున్ వేణు శ్రీరామ్ తో చెయ్యాల్సిన ఐకాన్ ఇక అటకెక్కిందనే న్యూస్ మొదలైంది. ముందుగా వేణు శ్రీరామ్ లైన్ చెప్పినప్పుడు ఓకేనన్న అల్లు అర్జున్… పూర్తి కథను చెప్పిన తరువాత అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందనటున్నారు. మరి అల్లు అర్జున్ చేతిలో సుకుమార్ బుక్కవుతాడనుకుంటే… వేణు శ్రీరామ్ బుక్కయ్యాడట.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*