నా పేరు సూర్య కి అదే మైనస్ అవుతుందా?
ఇప్పుడు ఏ ఒక్క సినిమా విడుదలైన ఆ సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేస్తున్నారు. తమ సినిమా మీద ప్రేక్షకులకు బాగా ఆసక్తి కలిగించాలి అంటే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చెయ్యాలని దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఫిక్స్ అవడం.. ఒక రేంజ్ లో తమ సినిమాలను ప్రమోట్ చెయ్యడం వంటివి ఇప్పుడు కామన్ అయ్యింది. కేవలం బడా సినిమాలే ఇలా చెయ్యడం లేదు. చిన్న సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేందుకు పబ్లిసిటీకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రింట్ మీడియా కి, ఛానల్స్ కి, వెబ్ మీడియా కి ఆయా సినిమాల యాడ్స్ ని ఇవ్వడమే కాదు... తమ సినిమాల మీద పాజిటివ్ గా న్యూస్ లు రాపిస్తూ... తమ సినిమా యాడ్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
యాడ్స్ ఇవ్వకుండా....
ఇలా సినిమాలు భారీ రేంజ్ లో హిట్ అవుతున్నాయి అంటే... అందులో మెయిన్ గా పబ్లిసిటీనే కారణమవుతున్నాయి. అయితే రామ్ చరణ్ రంగస్థలం, మహేష్ భరత్ అనే నేను సినిమాలకు ఈ పబ్లిసిటీ చాలా ఉపయోగపడింది. సినిమాకి ఎంతగా పాజిటివ్ టాక్ వచ్చినా మౌత్ టాక్ కూడా చాల అవసరం. అయితే ఇప్పుడు నా పేరు సూర్య విషయం లో ఈ పబ్లిసిటీ విషయంలో నిర్మాతలు నాగబాబు , శ్రీధర్ లు మాత్రం నా పేరు సూర్య పబ్లిసిటి విషయంలో ఎందుకో సఫర్ అవుతున్నారు. అదేమిటంటే ప్రస్తుతం శ్రీరెడ్డి, పవన్ ఇష్యుతో సినిమా ప్రముఖులు ఎడతెగని చర్చలు జరిపి కొన్ని ఛానల్స్ ని బ్యాన్ చేస్తున్నారనే టాక్ రావడమే కాదు.. ఆయా ఛానల్స్ కి ముఖ్యమైన యాడ్స్ ని ఆపేసారు కూడా. ప్రముఖ ఛానల్స్ కి ఈసారి నా పేరు సూర్య యాడ్స్ ఇవ్వలేదు. ఛానల్స్ లో తమ సినిమాకి పబ్లిసిటీ చేస్తే చాలనుకుని లెవల్లో ఉన్న నిర్మాతలు ఇప్పుడు సినీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవడానికి రెడీ అయ్యారు.
తప్పుచేశారా?
మరి ఇలాంటి టైం లో నా పేరు సూర్య యాడ్స్ ఇవ్వకుండా ఆపి సూర్య నిర్మాతలు ఏదన్నా తప్పు చేసారా అనిపిస్తుంది. ఎందుకంటే రోజూ ప్రజలు తిలకించే ఛానల్స్ లో నా పేరు సూర్య గురించిన యాడ్స్ గాని.. సినిమాకి సంబందించిన పబ్లిసిటి కానీ ఎక్కడా కనబడడం లేదు. మరి ఈ లెక్కన నాగబాబు, శ్రీధర్ లు కావాలనే ఆయా ఛానల్స్ వారిని అవాయిడ్ చేసినట్లుగా అనిపిస్తుంది. మరి ఇలా ఇప్పుడు అవాయిడ్ చెయ్యడం వలన నా పేరు సూర్య కి ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ బడా ఛానల్స్ కి కూడా ఆయా సినిమాల యాడ్స్ తగ్గితే అది పెద్ద దెబ్బె అని చెప్పాలి.