గాయపడ్డ సైనికుడు

అల్లు అర్జున్ తన సినిమాలతో రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టాలీవుడ్ లో బన్నీకి ఉన్న సక్సెస్ రేట్ మరో స్టార్ హీరోకి లేదంతే అతిశయోక్తి కాదు. అటువంటి బన్నీకి ‘నా పేరు సూర్య’ సినిమాతో షాక్ తగిలేలా ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా ఫుల్ రన్ లో జస్ట్ బ్రేక్ఈవెన్ వరకు రావచ్చంతే. అంతకుమించి బన్నీకి అంత సీన్ లేదంటున్నారు ట్రేడ్ జనాలు.

‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ వసూళ్లు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. బన్నీ లాస్ట్ మూవీ ‘డీజే’ డివైడ్ టాక్ వచ్చిన తొలి వీకెండ్ ముగిసేసరికి 43 కోట్ల షేర్ వచ్చింది. ఆ తర్వాత ఓవరాల్ గా ఫుల్ రన్ దాదాపు మరో 30 కోట్లను వసూల్ చేసింది. కానీ ‘నా పేరు సూర్య’ సినిమా మాత్రం తొలి వారాంతంలో 36 కోట్ల దగ్గరే షేర్ ఆగిపోయింది. అంటే బన్నీ గత చిత్రం ‘డీజే’ తో పోల్చుకుంటే దాదాపు 20 శాతం వసూళ్లు తగ్గాయన్న మాట.

బన్నీ ఇటువంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం వల్లనే ఈ రిజల్ట్ అని చెబుతున్నారు. మెయిన్ గా ఈ సినిమాలో సాంగ్స్ వచ్చినప్పుడల్లా జనాలకి చిరాకు రావడం..కామెడీ లేకపోవడం వంటి కారణాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. అసలు బన్నీ స్ట్రెంగ్త్ కామెడీనే. అందుకే ‘డీజే’ సినిమా వసూల్ పరంగా పాస్ అయిపోవడానికి కారణం. కానీ ‘నా పేరు సూర్య’లో ఎమోషన్ కోసం.. ఫన్ ను దాదాపుగా పూర్తిగా పక్కన పెట్టేయడం కూడా కారణం కావచ్చని అంటున్నారు. బన్నీ ఏమో.. నేను గొప్ప సినిమా చేసానని చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి బన్నీ జడ్జిమెంట్ మాత్రం మిస్ అయిందని చెప్పవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*