బ‌న్నీ యుద్ధం పెద్ద‌దే…!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ (బ‌న్నీ) న‌టించిన నా పేరు సూర్య అన్ని కార్యక్ర‌మాలు కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా సైనికుల చ‌రిత్ర‌తో ద‌శాబ్దాల అనుబంధం ఉన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మిల‌ట‌రీ మాధ‌వ‌రంలో జ‌రిగింది. మే 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సూర్య సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.

సెన్సార్ సర్టిఫికేట్……

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. సెన్సార్ బోర్డు స‌భ్యులు కూడా పాజిటివ్‌గా స్పందించిన‌ట్టు స‌మాచారం. ఫ‌స్టాఫ్‌లో బ‌న్నీ, హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల‌తో సెకండాఫ్‌లో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమా మూవ్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ర‌న్ టైం ఎక్కువ‌గానే ఉంది.

రన్ టైం ఎక్కువే….

ఇటీవ‌ల టాలీవుడ్‌లో సినిమాల‌ను ర‌న్ టైంతో సంబంధం లేకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అర్జున్‌రెడ్డి, రంగ‌స్థ‌లం, తాజాగా వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను ఈ సినిమాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ఈ కోవ‌లోనే నా పేరు సూర్య ర‌న్ టైం 2.47 గంట‌లు (167 నిమిషాలు) గా ఉంది. క‌థ డిమాండ్ మేర‌కు ఎక్కువ సీన్లు ట్రిమ్ చేసే వీలు లేక‌పోవ‌డంతో ఈ మేర‌కు ర‌న్ టైం ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాస్తవంగా సినిమా 3 గంట‌ల పైనే వ‌చ్చినా యూనిట్‌, డైరెక్ట‌ర్‌, ఎడిట‌ర్ ద‌గ్గ‌రుండి ఫ‌స్టాఫ్‌లో కొన్ని ప్రేమ సీన్లు ట్రిమ్ చేశార‌ని టాక్‌. స్టార్ రైట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. వంశీకి ఇదే డెబ్యూ సినిమా. త‌మిళ హీరో అర్జున్‌, శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Ravi Batchali
About Ravi Batchali 41286 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*