మెగా పార్టీ అదుర్స్

మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీలోనే కాదు, ఏ టాలీవుడ్ హీరో ఫ్యామిలిలో పార్టీ జరిగినా ఆ పార్టీ గురించే ఇండస్ట్రీలో ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. రీసెంట్ గా దీపావళి వేడుకల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగ బాబు, సాయి ధరమ్, అల్లు అరవింద్ ఫ్యామిలీస్ కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ ముచ్చట్లు ఇంకా మరవకముందే జబర్దస్త్ నాగబాబు బర్త్ డే వేడుకలు మెగా ఫ్యామిలి ఓ రేంజ్ లో జరిగాయి. మెగా హీరో నాగబాబు పుట్టినరోజు వేడుకలను మెగా ఫ్యామిలీ ఓ రేంజ్ లో ఏర్పాటు చేసింది. చిరు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లు అంతా కలిసి నాగబాబు బర్త్ డే పార్టీని అదిరిపోయే రేంజ్ లో చేసుకున్నారు.

హ్యాపీ బర్త్ డే నాగ్….

బ్లాక్ డ్రెస్సులతో మెగా ఫ్యామిలీ ఉన్న ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. నిన్న నాగబాబు బర్త్ డే సందర్భంగా జబర్దస్త్ నటులే కాకుండా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. మరి అన్నిటికి మించి ఫ్యామిలీ మొత్తం ఇలా పార్టీ చేసుకోవడం చూసిన మెగా ఫాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. కాకపోతే దీపావళి వేడుకల్లో భార్య కొడుకు తో కలిసి మెగా ఫ్యామిలీ దివాళి పార్టీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ నాగబాబు బర్త్ డే వేడుకలకు దూరం గా వున్నారు. ఇక మిగతా కుటుంబ సభ్యులు మాత్రం నాగబాబు బర్త్ డే పార్టీని బాగా ఎంజాయ్ చేశారని ఈ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*