
నాగబాబుకు సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ గా చేసినా రాని క్రేజ్.. జబర్దస్త్ ప్రోగ్రాం తో మాత్రం వీర లెవల్లో వచ్చింది. ఆరెంజ్ సినిమా తీసి చేతులు కాల్చుకున్న నాగబాబు కి జబర్దస్త్ కామెడీ షో ఆర్ధికంగా ఆదుకుంది. జబర్దస్త్ షో తో భారీగా లాభపడిన నాగబాబు ఇప్పుడు ఆ షో నుండి వ్యక్తిగత కారణాలతో బయటికి వచ్చేసాడు. క్రియేటివ్ డిఫ్రెన్సెస్ అని క్లారిటీ ఇచ్చిన… నాగబాబు జబర్దస్త్ నుండి బయటికి రావడాన్ని మెగా ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక నాగబాబు కూడా జబర్దస్త్ నుండి బయటికొచ్చాక..అందులో నుండి బయటికి రావడానికి గల కారణం చెప్పి సైలెంట్ గా ఉండాలి కానీ.. ఇప్పుడు జబర్దస్త్ నుండి తాను బయటికెందుకు వచ్చాడు, అసలు జబర్దస్త్ ఎలా స్టార్ట్ అయ్యింది, జబర్దస్త్ లో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనే దానిమీద ఓ సీరియల్ వీడియోస్ స్టార్ట్ చేసాడు.
జబర్దస్త్ నుండి బయటికెళ్ళాక జీ ఛానల్ తో పాపులారిటీ సంపాదించుకుందామని చూస్తున్న నాగబాబు…మళ్ళీ జబర్దస్త్ ప్రోగ్రాం మీద కామెంట్ చెయ్యడమెందుకు సైలెంట్ గా ఉండక అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అంటే నాగబాబు జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీని కాపుడుకోవడానికే.. బుల్లితెర ప్రేక్షకులకు అవసరం లేకపోయినా… జబర్దస్త్ విశేషాలను చెప్పుకుంటూ వస్తున్నాడని, మొదట జబర్డస్ట్ మీద పాజిటివ్ గా మాట్లాడి.. చివరిలో జబర్దస్త్ వలన తానెంత నష్టపోయానో చెప్పి సింపతీ క్రియేట్ చేసుకోవడానికే ఇలా వీడియోస్ వదులుతున్నాడంటూ మండిపడుతున్నారు. మరి నాగబాబు గతంలో బాలయ్య ని తిట్టడానికి కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్ మీద ఎపిసోడ్స్ వీడియోస్ చేసి వదిలినట్లుగా ఇప్పుడు జబర్దస్త్ వీడియోస్ కూడా ఒకదాని తర్వాత మరొకటి వదలడం మాత్రం పక్కా అంటున్నారు
Nagababu sir unte jabhardhast show lo kalane veru but ayana lekunte fans ga maku bhadhagane undhi