వర్మ ఈజ్ బ్యాక్ అనేలా ఆఫిసర్ టీజర్

శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. ఈ చిత్రంతో రాము నాగ్ ని సరికొత్తగా చూపించనున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయ్యిన స్టిల్స్ లో నాగార్జున హ్యాండ్సమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. శివ తర్వాత వస్తున్నా చిత్రం కాబ్బట్టి ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయ్.

ఈ సినిమా టీజర్‌ను నేటి(సోమవారం) ఉదయం 10గంటలకు చిత్రబృందం రిలీజ్ చేసింది. నాగార్జున ఇందులో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ముంబై బ్యాక్ డ్రాప్ గా కథ మొత్తం నడుస్తుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో నాగార్జున హైదరాబాద్ నుండి ముంబై స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా వెళ్తాడు. తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేసే దాకా వదిలిపెట్టను అని నాగ్ సీరియస్ గా చెప్పడం మాస్ కి కిక్ ఇచ్చేదే.

వర్మ సినిమాల్లో కనిపించే మాఫియా బ్యాక్ డ్రాప్ ఇందులో కూడా ఉన్నప్పటికీ ఎక్కువ ఫోకస్ నాగ్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టడంతో ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. టీజర్ మొత్తంలో తెలుగు నటుల్లో అజయ్ మాత్రమే కనిపించాడు. ముంబై బ్యాక్ డ్రాప్ కాబట్టి వాతావరణం, నటీనటులు, మొత్తం అక్కడి సెటప్ లాగే కనిపిస్తోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. హీరోయిన్ మైరా సరీన్ ను గ్లామర్ పరంగా చూపించకుండా చేజింగ్ లో గన్నులు పేలుస్తూ చూపించడం కొసమెరుపు. మొత్తానికి వర్మ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఆఫీసర్ ఉంటాడో లేదో మే 25న తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*