నానీ… ఎందుకింత డల్ ..?

గ్యాంగ్ లీడర్

నాని గ్యాంగ్ లీడర్ రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రివెంజ్డ్రామాగా ఉండబోతుంది అనేది గ్యాంగ్ లీడర్ ట్రైల ర్లోనే చూసేసాం. అయితే నాని గత సినిమాల విషయంలో విడుదలకు ముందున్న క్రేజ్ ఈ గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలకు ముందు కనిపించడం లేదు. సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ…. ఎందుకో ఎక్కడో తేడా కొట్టేస్తుంది. నాని కి జెర్సీ సినిమాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఉన్నప్పటికీ… గ్యాంగ్ లీడర్ మీద క్రేజ్ కాసింత కూడా పెరగలేదు. ప్రమోషన్స్ పరంగా నాని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.

ఇది క్లిష్ట సమయమేనా…..

కాలేజెస్ టూర్ అని, ఛానల్స్ కి ఇంటర్వూస్ అని, బిగ్ బాస్ లోకి వెళ్లి గ్యాంగ్ లీడర్ ని ప్రమోట్ చేసుకోవడం ఇలా ఎన్ని చేసినా గ్యాంగ్ లీడర్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించడం లేదు. కారణం ఈ సినిమాలో నాని హీరోలా కనిపించకపోవడమే. రెండు వరస డిజాస్టర్స్ తో ఉన్న హీరో కార్తికేయ విలన్ రోల్ చెయ్యడం కూడా సినిమాకి మైనస్ గా మారిందేమో… అన్నట్లుగా వుంది. ఆడవాళ్ళని వెంటేసుకుని.. రివెంజ్ తీర్చుకునే కుర్రాడిగా… నాని ని చూస్తుంటే.. సినిమా అంత ఎక్కేలా కనిపించడం లేదనిపిస్తుంది. మరి విక్రమ్ కుమార్ మీద అపనమ్మకమో…. సాహో ప్లాప్ నుంచి ప్రేక్షకుడు ఇంకా తేరుకోలేదు కానీ.. గ్యాంగ్ లీడర్ కి ఇది క్లిష్ట సమయమే. అసలే 28 కోట్ల థియేట్రికల్ బిజినెస్… అంత సొమ్ము రావాలంటే ఇలాంటి హైప్ తో కష్టమేసుమీ..!

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*