నాని కృష్ణార్జున యుద్ధం రివ్యూ

టాలీవుడ్ లో గత కొంత కాలం నుండి సక్సెస్ ఫుల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది నానినే. గత కొంత కాలం నుండి నాని చేస్తున్న సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి. తన నటనతో ఎటువంటి కథైనా హైలెట్ అయ్యేలా చూసుకుంటూ ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంటున్నాడు. కొంచం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

అటు ఫ్యాన్స్ కూడా నాని సినిమా అంటే మినిమం ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని భావించి అతని సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాని – అనుపమ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం ఈ శుక్రవారం మన ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ వర్క్ కూడా ఫినిష్ చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా రన్ టైం 158 నిమిషాలు.

సినిమాను చూసిన సెన్సార్ మెంబెర్స్ సినిమా చాలా బాగుందని పాజిటివ్ వైబ్రెషన్స్ ఇచ్చారు. నాని యాక్టింగ్ తో పాటు డైరెక్టర్ మెర్లపాక గాంధీ మార్క్ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అవుతుందని చెప్పారంట. నాని యాక్టింగ్ అయితే చాలా బాగుందని పాజిటివ్ కామెంట్స్ చేసారంట.అంతే కాకుండా సినిమాను చూసిన కొంత మంది ప్రముఖులు కూడా అదే చెబుతున్నారు. దీని బట్టి చూస్తుంటే నానికి మరో సూపర్ హిట్ కాయంలా కనిపిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*