ఏంటీ….నయన్ ఒప్పుకుందా

నయనతార

సైరా సినిమా ప్రమోషన్స్ నిన్న సాయంత్రం నుంచి ట్రైలర్ తో ఊపందుకున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న సైరా టీం ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ప్రమోషన్స్ ని పీక్స్ లో నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. అయితే ఎన్నిసైరా ప్రమోషన్స్ జరిగినా అందులో హీరోయిన్ గా నటించిన నయనతార మాత్రం సినిమాని ప్రమోట్ చెయ్యడానికి మాత్రం రాదని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే నయనతార ఎప్పుడూ సినిమా ప్రమోషన్స్ కి రాదుగనక. అయితే మధ్యలో చెర్రీ.. నయన్ తో పర్సనల్ గా మాట్లాడాడనే టాక్ నడవడమే కాదు… నయన్ కూడా ఒప్పుకోలేదని అన్నారు.

తమిళంలో తిరుగుండదు……

తాజా సమాచారం ప్రకారం నయనతార సైరా ప్రమోషన్స్ లో భాగమవడానికి ఒప్పుకుందట. చెన్నైలో జరిగే ప్రమోషన్ ఈవెంట్‌ తో పాటు హైదేరాబాద్ లో జరిగే సైరా ప్రీరిలీజ్ఈ వెంట్ కి కూడా నయనతార రానుందని సమాచారం. మరి నయనతార గనక సైరా ప్రెస్ మీట్ కి హాజరైతే.. తమిళంలో సైరా సినిమాకి తిరుగుండదు. అందుకే నయన్ ని ప్రమోషన్స్ కోసం గట్టిగానే ఒప్పించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఈవెంట్ తో యావత్ ఇండియా సైరా వైపు చూడాలనే టార్గెట్ తో రామ్ చరణ్ అండ్ టీం సైరా ప్రీ రిలీజ్
ఈవెంట్ ని భారీఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*