`కో ..కో ..కోకిల‌` అంటోన్న నయనతార

న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌ధారిగా నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం `కో..కో..కోకిల‌`. ఇటీవ‌ల త‌మిళంలో `కోల‌మావు కోకిల‌` పేరుతో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో.. అద్వితీయ‌మైన క‌లెక్ష‌న్స్‌ తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో `కో..కో..కోకిల‌` పేరుతో ఆగ‌స్ట్ 31న విడుద‌ల చేస్తున్నారు. ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి.. ఓ స్మ‌గ్లింగ్ గ్యాంగ్ చేతిలో అనుకోకుండా చిక్కుకుపోతుంది. అటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల నుండి ఆమె ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నే పాయింట్‌ పై డైరెక్ట‌ర్ నెల్స‌న్ ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు.

తారాగణం, సాంకేతిక నిపుణులు…

న‌య‌న‌తార, యోగిబాబు, శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్ తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌, కెమెరా: శివ‌కుమార్ విజ‌య‌న్‌, నిర్మాణం: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, ద‌ర్శ‌క‌త్వం: నెల్స‌న్‌.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*