ఈ దీపావళి కి రష్మిక హడావిడే

రష్మిక మందన్న

ఈరోజు దీపావళి కానుకగా టాలీవుడ్ లో రూపొందుతున్న సినిమాలకి సంబంధించి పోస్టర్స్, సాంగ్స్, స్టిల్స్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిన్న అల్లు అర్జున్ సినిమా నుండి సాంగ్ వస్తే ఈరోజు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ ‘భీష్మ’ నుండి పోస్టర్స్ వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల్లో రష్మిక హీరోయిన్ కావడం విశేషం.

నితిన్ – రష్మిక జంటగా నటిస్తున్న భీష్మ సినిమాను వెంకీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఈరోజే పర్ఫెక్ట్ పోస్టర్స్ ని రిలీజ్ చేసింది టీం. ఇందులో రష్మిక పోస్టర్ కూడా ఉంది. అలానే మహేష్ – రష్మిక – అనిల్ రావిపూడి కాంబినేషన్ వస్తున్నా ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి నిన్న రెండు పోస్టర్ లు వస్తే ఈరోజు రష్మిక కి సంబంధించి ఒక పోస్టర్ వచ్చింది.

ఈ రెండు సినిమాల పోస్టర్స్ లో రష్మిక లుక్స్ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. దాంతో సోషల్ మీడియా మొత్తం రష్మిక హడావిడే కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*