బాబోయ్ పవన్.. స్పందించవయ్యా
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో సినిమాల్లోకి రావడం షురూ అయ్యింది . దిల్ రాజు, పవన్ హీరోగా వేణు శ్రీరామ్ తో పింక్ రీమేక్ సినిమాని [more]
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో సినిమాల్లోకి రావడం షురూ అయ్యింది . దిల్ రాజు, పవన్ హీరోగా వేణు శ్రీరామ్ తో పింక్ రీమేక్ సినిమాని [more]
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో సినిమాల్లోకి రావడం షురూ అయ్యింది . దిల్ రాజు, పవన్ హీరోగా వేణు శ్రీరామ్ తో పింక్ రీమేక్ సినిమాని మొదలెట్టాడు. అయితే ఇంతవరకు పవన్ కళ్యాణ్ తాను రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం పై మాత్రం స్పందించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ చెయ్యబోయే సినిమాల లిస్ట్ రోజుకో రకంగా సోషల్ మీడియాలో వినబడుతుంది. 25 రోజుల్లో పింక్ రీమేక్ పూర్తి చేసే పవన్ కళ్యాణ్ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పిరియాడికల్ డ్రామా చేస్తాడని.. ముస్లిం రాజుల కాలం నాటి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ దొంగగా కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
మరో పక్క కెమెరామెన్ గంగ తో రాంబాబు సినిమా చేసిన దర్శకుడు పూరి పేరు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా లిస్ట్ లో చేరింది. పింక్ రీమేక్ పూర్తి కాగానే.. క్రిష్ సినిమా.. అది పూర్తి కాగానే పూరి జగన్నాధ్ తో పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఫైటర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో పూరి సినిమా చెయ్యాలని.. ఇప్పటికే పవన్ కోసం కథ ని రెడీ కూడా చేసుకున్నాడని, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి పూరి రెడీ అంటున్నారు. మరి పూరి అంతా మాస్.. పూరి మార్క్ హీరోయిజానికి పవన్‌కి ప్రస్తుతం ఉన్న ఇమేజ్ అస్సలు సెట్ కాదు. అసలు పూరి తో పవన్ కమిట్మెంట్ ఉంటుందా.. లేదా.. అనేది సస్పెన్స్. ఇంత జరుగుతున్నా పవన్ స్పందించడం లేదు.. అందుకే పవన్ ఫ్యాన్స్ కి పవన్ విషయంలో ఇంకా కంగారుగానే ఉంది.