అందుకే నివేత ని హైలెట్ చెయ్యలేదు
మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలో గుర్తింపు తెచ్చుకున్ననివేత పేతురేజ్ కి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ రాగానే అబ్బ నివేత పేతురేజ్ [more]
మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలో గుర్తింపు తెచ్చుకున్ననివేత పేతురేజ్ కి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ రాగానే అబ్బ నివేత పేతురేజ్ [more]
మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలో గుర్తింపు తెచ్చుకున్ననివేత పేతురేజ్ కి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ రాగానే అబ్బ నివేత పేతురేజ్ అంత అదృష్టవంతురాలు లేదు.. బన్నీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ తగిలింది అన్నారు. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండదు అనేది అత్తారింటికి దారేదిలో ప్రణీతని చూసినప్పుడు, అరవింద సమేత లో ఈషా రెబ్బ ని చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ నివేత పేతురేజ్ కి ఎమన్నా మంచి రోల్ ఇచ్చాడేమో అనుకున్నారు కానీ… ఆమెని ఒక్క ప్రోమోలోకాని, ఒక్క సాంగ్ లో కానీ, ట్రైలర్ కానీ త్రివిక్రమ్ హైలెట్ చెయ్యకయేసరికి.. అసలు బన్నీ పక్కన నివేత పేతురేజ్ ఎలాంటి కేరెక్టర్ చేసిందో అనే ఆసక్తితో ఉన్నారు.
తీరా సినిమా విడుదలయ్యాక నివేత పేతురేజ్ పాత్ర చూసాక అందుకే నివేత పేతురేజ్ ని ఎక్కడా హైలెట్ చెయ్యలేదనిపిస్తుంది. ఎందుకంటే నివేత పేతురేజ్ పాత్ర గ్లామర్ గా ఉనప్పటికి.. కేవలం సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా పరిమితమైంది కానీ… బన్నీ తో కాంబో సీన్స్ లేనే లేవు. ఇక పూజ హెగ్డే గ్లామర్ ముందు నివేత ఎందుకు పనికిరాదు. అసలు త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ కి ఉన్న ప్రాముఖ్యతను నివేత పేతురేజ్ మరోసారి చూయించింది అంతే. ఆమె గురించి అంతకన్నా చెప్పడానికేం లేదు. హీరోయిన్ పూజ హెగ్డే పాత్రే అంతంతమాత్రంగా ఉంది.. ఇక సెకండ్ హీరోయిన్ పాత్రని అంతకన్నా ఎక్కువగా ఊహించుకోవడం కూడా వేస్టే.