ఆమె నటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు

మహానటి సావిత్రి అంటే ఏ జనరేషన్ కి అయిన నచ్చే హీరోయిన్. రీసెంట్ గా విడుదల అయిన ఆమె జీవిత కథ చిత్రం ‘మహానటి’ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా విడుదల అవ్వకముందు అసలు సావిత్రి ఎందుకు చచ్చిపోయింది? కోమాలోకి ఎందుకు వెళ్ళింది? మందుకు ఎందుకు బానిస అయింది? అని అలా చాలా ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరి ప్రశ్నలకు సమాధానం దొరికింది. అలాంటి ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు సైతం, కీర్తిసురేశ్ ను ఎంతగానో అభినందిస్తున్నారు. ఈ సినిమా టీమ్ ను ప్రశంసిస్తున్నారు. అ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.

” సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటనను గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. మంచి నటీనటులతో కలిసి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన గొప్ప ప్రయోగం ఫలించింది” అని అన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ కి ఆయన అభినందనలు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*