ఎన్టీఆర్ అయితే బావున్నాడు.. కానీ ఆ పనే

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

ఎన్టీఆర్ గత ఏడాది హిట్ కొట్టిన జై లవ కుశ సినిమా టీజర్ విడుదలకు ముందే ఆ టీజర్ కి సంబందించిన కొన్ని సీన్స్ అంటే మెయిన్ హైలెట్ అయిన జై కి సంబందించిన సన్నివేశాలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. అప్పట్లో ఆ సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేసాడు. మరి సెట్ లో రకరకాల మనుషులు అంటే 24 క్రాఫ్ట్స్ కి సంబందించిన జనాలు పని చేస్తారు. కానీ అందులో ఎవరో ఒకరు క్యూరియాసిటీ కొద్దీ ఆ సినిమాకి సంబందించిన పిక్స్ గాని.. సీన్స్ గని లీక చెయ్యడం అనేది ఇంటర్నెట్ ని విపరీతంగా వాడుతున్న ఈ కాలంలో బాగా సర్వసాధారణం అయ్యింది. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల్లో అనేక లీక్డ్ పిక్స్ ఎప్పటికప్పుడు నెట్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మహేష్ 25 మూవీ మొదలైన మొదటి రోజే మహేష్ గెడ్డంతో గళ్ళ చొక్కాతో ఉన్న పిక్ లీకైంది. అలాగే గత నాలుగు రోజుల క్రితం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అరవింద సమేత లో ఒక ఎమోషనల్ పిక్ లీక్ అయ్యింది. తాజాగా చిరంజీవి సై రా నరసింహారెడ్డి కి సంబందించిన 40 కోట్ల భారీ సెట్స్ పిక్స్ నెట్ లో లీక్ అయ్యాయి. ఇక ఈవేళ మళ్ళీ మరోసారి ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ ఎన్టీఆర్ రాయలసీమ లుక్ లీక్ అయ్యింది. ఇప్పుడా పిక్ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తుంది.

ఆ పిక్ లో ఎన్టీఆర్ సీమ బిడ్డగా తెల్ల రంగు లాల్చీ లో చాలా స్టైలిష్ గా కనబడుతున్నాడు. మరి సీమ గెటప్ అంటే రఫ్ గా లేకపోయినా ఎన్టీఆర్ ఈ సీమ లుక్ మాత్రం అదరగొట్టేస్తుందనే చెప్పాలి. మరి ఇలా ఎప్పుడుబడితే అపుడు పిక్స్ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అవుతుంటే సినిమా మీద క్రేజ్ అండ్ క్యూరియాసిటీలు తగ్గిపోతుంది. మరి ఈ మధ్యన ఫొటోస్ లీకులపై త్రివిక్రమ్ కాస్త ఆగ్రహంగా ఉన్నాడని… అరవింద సెట్ లోకి ఫోన్స్ గాని. లాప్టాప్స్ గాని, టాబ్స్ కానీ తేవద్దని యూనిట్ మెంబెర్స్ కి సీరియస్ గా వార్న్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. మరి మొదటి లీకురాయుళ్లేవారో కనిపెట్టకముందే మళ్ళీ వెంటనే ఇలా సెట్స్ నుండి ఫొటోస్ లీక్ పై యూనిట్ సభ్యులంతా మల్లగుల్లాలు పడుతున్నారట.

ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఈ సినిమా ని అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక అరవింద సమేత ఫస్ట్ లుక్ ని వచ్చే నెల అంటే ఆగష్టు నెలలో విడుదల చేస్తున్నట్లుగా సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*