స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టుకున్న బన్నీ

అల్లు అర్జున్

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాను పూర్తి చేసాక త్రివిక్రమ్ కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు తీయనున్నారు. గత కొన్ని నెలలు నుండి హీరో నానితో త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఆల్రెడీ మాటలు కూడా జరిగిపోయాయి అని టాక్. స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తే తనలోని రైటర్ పని తగ్గిపోతుందని భావించిన త్రివిక్రమ్‌ మీడియం రేంజ్ సినిమాలు తీయాలనుకుంటున్నాడు.

అందుకే గతంలో నితిన్ తో ‘అ ఆ’ చేసాడు. ఆ సినిమా మాదిరిగానే తన తర్వాత రెండు సినిమాలు ఉండబోతున్నాయి అని టాక్. అయితే ఒకటి నానితో కాగా మరొకటి అల్లు అర్జున్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా తర్వాత బన్నీ ఒక కమర్షియల్‌ సినిమా చేయాలనుకుంటున్నాడు.

సో త్రివిక్రమ్ అయితే సేఫ్ అని భావించి అతనితో ఖాయం చేసుకున్నాడట. గతంలో వీరి కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలు ఫ్యామిలీస్ తో పాటు యూత్ ని కూడా అలరించాయి. మళ్లీ వీరి కాంబినేషన్ సినిమా అంటే బిజినెస్ పరంగా క్రేజ్‌ బాగా ఉంటాడని భావించి త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి బన్నీ ఫిక్స్ అయ్యాడు. 2019 చివరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*