బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా?

సినిమాను ఎనౌన్స్ చేసినప్పటి నుండి ఏదొక సమస్య వస్తూనే ఉంది. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ఎంత ముందుకు తీసుకుని వెళదాం అనుకున్న అది అంత వెనక్కు జరుగుతుంది. బాలయ్య ఉన్న కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇక బాలయ్య ఫైనల్ గా ఈ బయోపిక్ స్పీడ్ ను పెంచే విధంగా ముందుకు సాగుతున్నాడు.

ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసారు బాలయ్య. అయితే ఈ సినిమా నుండి తేజ తప్పుకోవడంతో ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేసే అవకాశం క్రిష్ కి దక్కింది. బాలయ్య 100వ సినిమాను తన జీవితంలో గుర్తిండిపోయే హిట్ ఇచ్చిన క్రిష్ ను బాలయ్యే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ క్రిష్ ఫైనల్ అయ్యాడని ఫిలింనగర్ టాక్. అయితే ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను చేయడానికి రానాను ఫిక్స్ చేశారు.

రానా సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మరో ఇంట్రెస్టింగ్ పాత్ర కోసం బాలయ్య శర్వానంద్ ని ఒకే చేసినట్టు సమాచారం. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లో ఉన్న పాత్ర చేసేందుకు శర్వానంద్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. యంగ్ ఏజ్ లో ఎన్టీఆర్ సన్నంగానే ఉండేవాడు. అంటే ఆ ఏజ్ మాదిరిగా బాలయ్య కనిపించాలి అంటే కష్టం, సన్నాబడాలని ట్రై చేసినా కూడా సమయం సరిపోదు. అందుకే ఆ పాత్రకు శర్వానంద్ అయితే బాగుంటాడని అతని సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*