వాహ్.. క్యా సీన్ హై…

ntr biopic Mahanayakudu telugu post telugu news

ఈరోజు విడుదల అయినా ‘ఎన్టీఆర్ ‘సినిమాలో పోస్టర్ అంచనాలు పెంచేసిస్తుంది. అంచనాల మధ్య స్టార్ట్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం రోజురోజుకి అంచనాలని రెట్టింపు చేస్తుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అల్లుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు. అసలు ఇందులో రానా చంద్రబాబులా ఎలా ఉంటాడో అన్న ప్రశ్నల మధ్య నిన్న చంద్రబాబు పాత్రకు సంబంధించి ఫస్ట్ లోక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు.

అచ్ఛం చంద్రబాబులా దిగిపోయిన రానా పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. దానికి తోడు ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇంకో పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో బాలకృష్ణ అంటే ఎన్టీఆర్.. రానా అంటే చంద్రబాబు భుజంపై చేయి వేసి ఏదో చెప్పుతున్నట్టు కనిపిస్తుంది. ఆ పోస్టర్ చూస్తూనే వారిద్దరూ ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్లు అర్ధం అవుతుంది. అల్లుడికి కర్తవ్యం భోధిస్తున్నారా? రాజకీయాల్లో ఎలా ఉండాలో నేర్పిస్తున్నారా? రాజకీయం ఒక రణం లాంటిదని రణక్షేత్రంలో ఎత్తు పైఎత్తు వేయడం తప్పదని ఉద్భోధిస్తున్నారా? సంథింగ్ ఏదో కీలక పరిణామమే.

తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తన క్యాబినెట్ లో అల్లుడు చంద్రబాబుకు చోటిచ్చారు. అక్కడ నుండి ఇద్దరి రాజీకీయం మొదలైంది. వీరిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. కాలక్రమంలో రాజకీయాలు మారాక సన్నివేశం మారిందే కానీ అంతకుముందు ఆ ఇద్దరూ ఒకటే. ప్రస్తుతం ఆ పోస్టర్ ప్రేక్షకుల్లో కూరియాసిటీ ని పెంచేస్తుంది. అసలు ఆ సీన్ సినిమాలో ఎలా ఉండబోతుంది..ఏం మాట్లాడుకుంటున్నారు అని. నందమూరి బాలకృష్ణ – దగ్గుబాటి రానా కాంబినేషన్ స్క్రీన్ పై అభిమానుల్ని ఆకట్టుకుంటోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*