భయపడుతున్నాడా?

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

నిన్న జరిగిన ‘మహానటి’ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా వచ్చిన ఎన్టీఆర్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఈ జన్మలో తాతగారి పాత్రను చేయడం జరగని పని అని చెప్పాడు. అంతటి మాహా నటుడు పాత్రకు న్యాయం చేయటం చాలా కష్టమైన పని అని, అది తన వల్ల కాదని అన్నాడు. మరి నిజంగానే తన వల్ల కాదా లేదంటే ఫ్యామిలీ గొడవల్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ ఈ మాట అన్నాడో అనే హాట్ టాపిక్ ఇప్పుడు ఫిలింనగర్ లో వినబడుతుంది.

అయితే ఈ మహానటి ఆడియో వేడుకలో మాట్లాడిన ఎన్టీఆర్ ఇంకా…. ఈ సినిమాకి ముందు ప్రొడ్యూసర్ స్వప్న ఒక రోజు నన్ను కలవడానికి వచ్చింది. ఆ రోజు చెప్పింది మహానటిలో ఎన్టీఆర్ గారి పాత్ర నువ్వు చేయాలని నేను వెంటనే ‘నో’ చెప్పాను అని చెప్పాడు. ఆ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పా.. మళ్లీ ఇప్పుడు చెపుతున్న ఆయన వేషం వేసే అర్హత తనకు లేదని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

ఈ సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్..దుల్కర్..సమంత, విజయ్‌లకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నాడు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నటిస్తే రాదని జీవిస్తే వస్తుంది అని అలా వీరు మహానటి సినిమా కోసం జీవించి చేశారని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక సీతారామశాస్త్రి గురించి మాట్లాడే అర్హత, అనుభవం తనకు లేవని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*