ఎన్టీఆర్ కోలీవుడ్ కి వెళుతున్నాడు!

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

కోలీవుడ్ లో హిట్ అయిన చాలా సినిమాలని ఇక్కడ స్టార్ హీరోస్ దగ్గరనుండి యంగ్ హీరోస్ వరకు దక్కించుకుని రీమేక్ చేసేస్తుంటారు. కొన్ని సార్లు క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లు విడుదలకు ముందే తెలుగు హీరోలు ఆ సినిమాల మీద కన్నెయ్యడం చూస్తూనే ఉన్నాం. అయితే తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను పెద్దగా కోలీవుడ్ హీరోలు రీమేక్ చెయ్యరు. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ విడుదలైన తెలుగు సినిమా తమిళంలోనూ విడుదలవుతుంటాయి. ఇక ఎక్కడో ఒకటో అరా సినిమాలను మాత్రమే రీమేక్ చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు హిట్ సినిమాలు కోలీవుడ్ కి క్యూ కడుతున్నాయి.

పవన్ – త్రివిక్రమ్ కాంబోలో ఇండస్ట్రీ హిట్ అయిన అత్తారింటికి దారేది రీసెంట్ గా కోలీవుడ్ కి వెళ్ళింది. ఆ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక నిన్నటికి నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా టెంపర్ ని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రీమేక్ రైట్స్ దక్కించుకుని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. పూరి జగన్నాధ్ – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యింది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో నెగెటివ్ అండ్ ఎనర్జీ షేడ్స్ తో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాని బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా శింబ టైటిల్ తో తెరకెక్కుతుండగా… తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్నది.

ఇక తాజాగా ఎన్టీఆర్ మరో హిట్ సినిమా కోలీవుడ్ బాట పట్టింది. ఎన్టీఆర్ – సుకుమార్ కాంబోలో గత ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా కోలీవుడ్ కి వెళ్లబోతుంది. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమా మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో అదరగొట్టే హిట్ అయ్యింది. అయితే ఈసినిమాని తమిళ స్టార్ హీరో రీమేక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ హీరో ఎవరు.. డైరెక్టర్ ఎవరు.. అనే విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*