మ‌హేష్‌బాబుతో ఎన్టీఆర్ రిలేష‌న్ ఇదే… భ‌ర‌త్ సాక్షిగా చెప్పాడుగా…

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భ‌ర‌త్ అను నేను ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో అట్టహాసంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఈ స‌భ‌లా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓ స్టార్ హీరోగా ఉన్న మ‌హేష్‌బాబు సినిమా ఫంక్ష‌న్‌కు మ‌రో స్టార్ హీరో ఎన్టీఆర్ రావ‌డం విశేషం.

ఇక భారీగా తరలి వచ్చిన మహేష్‌ అభిమానులతో స్టేడియం కిక్కిరిపోయింది. హీరోయిన్ కైరా అద్వాణీ తెలుగులో నమస్కారం చెప్పారు. హైదరాబాద్‌కి థ్యాంక్స్‌ని తెలిపారు. చాలా మాట్లాడాలని అనుకున్నానని కాని ఎటునుంచి మొదలుపెట్టాలో తెలియడంలేదన్నారు. షూటింగ్‌లో చేసిన జర్నీ చాలా స్పెషల్ అని కైరా చెప్పారు. ఇక ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎన్టీఆర్ ప్ర‌సంగం ప్రేక్ష‌కుల‌తో కంటిన్యూగా చప్పట్లు కొట్టించింది.

నంద‌మూరి తార‌క రామారావు మ‌న‌వ‌డిని అయిన ఎన్టీఆర్ అను నేను అంటూ ప్ర‌సంగం స్టార్ట్ చేశారు. ఇక మ‌హేష్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఒక క‌మ‌ర్షియ‌ల్ స్టార్‌, హీరో అయ్యి ఉండి ఆయ‌న చేసిన ప్ర‌యోగాత్మ‌క సినిమాలు ఎవ్వ‌రూ చేయ‌లేదు… రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో మ‌హేష్ సినిమాలు చేస్తుంటార‌ని ప్ర‌శంసించారు.

తాము ఇప్పుడిప్పుడే కొత్త‌, వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో సినిమాలు తీస్తుంటే మ‌హేష్ ఎప్పుడో అలాంటి క‌థ‌ల‌తో సినిమాలు చేశాడ‌ని.. త‌మ‌కు ఇలాంటి విష‌యంలో మ‌హేష్ ఆద‌ర్శ‌న‌మ‌ని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక అభిమానుల‌కు మ‌హేష్ ప్రిన్స్‌, సూప‌ర్‌స్టార్ అయితే త‌న‌కు మాత్రం అన్న అని చెప్పాడు. తాను ఎప్పుడూ మ‌హేష్‌ను అన్న అని పిలుస్తుంటాన‌ని… ఇప్పుడు ఇదే విష‌యాన్ని ప‌బ్లిక్‌గా చెపుతున్నాన‌ని ఎన్టీఆర్ తెలిపాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*