ఎన్టీఆర్ మాయం.. రామ్ చరణ్ మాత్రం..!

mahesh babu maharshi party

2018లో రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ తో కెరీర్ లోనే పదికాలాలు గుర్తుండిపోయే హిట్ అందుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేతతో హిట్ కొట్టాడు. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, ఎన్టీఆర్ మాత్రం హిట్ కొట్టాడు. అయితే ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో RRR అనే మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత బోయపాటి సినిమా వినయ విధేయ రామ్ లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం రాజమౌళి RRR కోసం ఫ్రీ అయ్యాడు. మరే కమిట్మెంట్స్ లేవు. ఇక రాజమౌళి సినిమా కోసం ఈ స్టార్ హీరోలిద్దరు 200 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి 200 రోజుల కాల్షీట్స్ అంటే.. RRR పూర్తయ్యేసరికి ఏడాదిన్నర నుండి రెండేళ్లు పట్టడం ఖాయం.

ఎన్టీఆర్ కనపడాలంటే 2020 వరకు ఆగాల్సిందే…

అందుకే 2019లో ఎన్టీఆర్ మాత్రం తన సినిమాతో అభిమానుల ముందుకు రాదు. అలాగే పెద్దగా బయట కూడా కనబడడు. కానీ రామ్ చరణ్ మాత్రం 2019 లో వినయ విధేయ రామ సినిమాతో 2019 సంక్రాంతికి అభిమానులను హ్యాపీ చేస్తాడు. అలా ఎన్టీఆర్ 2019లో మాయమైతే… రామ్ చరణ్ మాత్రం 2019లో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఇక 2020 రాజమౌళి RRR మల్టీస్టారర్ విడుదలవుతుందనేది తెలిసిన విషయమే. పాపం ఎన్టీఆర్… రాజమౌళి సినిమాకి కమిట్ అయ్యాక మరో సినిమా చెయ్యలేడు. అందుకే 2019 లో ఏడాదంతా ఎన్టీఆర్ అభిమానులు RRR లో ఎన్టీఆర్ లుక్ తో సరిపెట్టుకోవాల్సిందే. పూర్తిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూడాలి అంటే 2020 వరకు ఆగాల్సిందే. మరి బాహుబలికి ప్రభాస్ ఐదేళ్లు త్యాగం చేసాడాయే. కానీ ఈసారి మాత్రం ఎన్టీఆర్, చరణ్ అన్ని ఏళ్లు త్యాగం చేయక్కర్లేదని రాజమౌళి ఈ స్టార్ హీరోలకు మాటిచ్చాడటలే.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*