అమ్మో…పులితోనే ఆ హీరో ఫైట్

యంగ్ టైగర్ Jr NTR

రాజమౌళి డైరెక్టర్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బల్గెరియా లో శరవేగంగా జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ పై ఇంట్రడక్షన్ సీన్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు రాజమౌళి. ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులకి దగ్గరగా ఉంటాడు అని తెలిసిందే. తన ఫ్యాన్స్ కోసం తన ప్రతి సినిమాలో మాస్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటాడు ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. పాత్రకు న్యాయం చేసే విధంగా రాజమౌళి ఎన్టీఆర్ కోసం ఓ పులి ఫైట్ పెట్టినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది రిలీజ్…..

ఎన్టీఆర్ పులి తో ఫైట్ చేసినట్టు విజువలైజ్ చేసి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ కు విదేశీ నిపుణుల టీమ్ పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కోసమే అని సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ వార్త వింటుంటేనే వెంట్రికలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఒకవేళ నిజం అయితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. 2020 జులై లో ఈమూవీ రిలీజ్ చేయనున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*