వీరమాచినేనిగారి డైట్ చేస్తే సరి పోయేది కదా

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

జై లవ కుశ టైం లో ఎన్టీఆర్ బాగా ఒళ్ళు పెంచేసి కొన్ని సీన్స్ లో కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాడు. అబ్బా మళ్ళీ రాఖి లో బండ ఎన్టీఆర్ ని చూస్తామేమో అన్నట్టుగా ఎన్టీఆర్ తయారవుతాడని అనుకున్నారు అంతా. కానీ ఎన్టీఆర్ మాత్రం జై లవ కుశ సినిమా విడుదలయ్యాక కూడా రెండు మూడు నెలలు అలానే లావుని మైంటైన్ చేసాడు. అయితే ఈ ఏడాది జనవరి నుండి ఎన్టీఆర్ బాలీవుడ్ ట్రైనర్ ఆధ్వర్యంలో కండలు కరిగించి పడేసాడు. జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తూ ఎక్కువటైం అందులోనే గడిపేశాడు. అయితే ఎన్టీఆర్ అంతగా కష్టపడుతున్నది రాజమౌళి సినిమా మల్టీస్టారర్ కోసమని.. ఆ సినిమాలో ఎన్టీఆర్ బాక్సర్ గా కనబడతాడని అన్నారు.

కానీ ఎన్టీఆర్ కండలు కరిగించింది మాత్రం త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ కోసమని…. అరవింద సమేత ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో అర్ధమయ్యింది. మరి త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ ఒకసారి స్టైలిష్ లుక్ అంటే.. లవర్ బాయ్ మాదిరిగా కనబడితే.. మరోమారు కండలు తిరిగిన వీరుడిగా.. యాక్షన్ సన్నివేశాలు చేస్తాడన్నమాట. మరి సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ అద్భుతాలు చెయ్యడానికి… సిక్స్ ప్యాక్ బాడీ ఎన్టీఆర్ కి రావడానికి వెనుక చాలానే కథ ఉందట. ఎన్టీఆర్ కి సిక్స్ ప్యాక్ బాడీ ఊరికే రాలేదట. సిక్స్ ప్యాక్ బాడీ షేప్ తీసుకురావడానికి ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడట.

గంటలు గంటలు జిమ్ లో వర్కౌట్స్ చెయ్యడమే కాదు… విపరీతముగా డైట్ కంట్రోల్ చేసాడట ఎన్టీఆర్. అస్సలు అన్నమే ముట్టకుండా.. ఒక్కో రోజు 15 లీటర్ల నీళ్లు మాత్రమే తాగుతూ.. కష్టపడడమే కాదు.. అసలు ఒక్కోమారు కేవలం రెండు లీటర్ల నీళ్లతో సరిపెట్టేసుకునేవాడట ఎన్టీఆర్. మరి అంతగా కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని తీసుకురావడమే కాదు…. ఎన్టీఆర్ ఏకంగా 10 కేజీల బరువు తగ్గాడట. మరి ఎన్టీఆర్ కున్న కమిట్మెంట్ చూస్తే ముచ్చటేస్తుంది కానీ.. అంతలా వర్కౌట్స్ చెయ్యడమెందుకు.. ఒక్కసారి ఎన్టీఆర్ విజయవాడ వీరమాచినేనిగారి డైట్ పాటిస్తే సరిపోయేది… కావాల్సినంత బరువు తగ్గిపోయేవాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైరికల్ డైలాగ్స్ వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*