మనసులను కదిలించిన ఎన్టీఆర్ భావోద్వేగం..!

NTR

నందమూరి హరికృష్ణ మరణంతో అరవింద సమేత అనుకున్న టైంకి రాదనుకున్నప్పటికీ… ఎన్టీఆర్ ఏంతో నిబద్దత, వృత్తి మీదున్న గౌరవంతో మిగిలిన నెల రోజుల షూటింగ్ పూర్తి చేశాడు. అరవింద ప్రమోషన్స్ లో భాగంగా అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కన్నీళ్లతో కనిపించారు. తండ్రి మరణించి నెల రోజులు కావొస్తున్నా వారు తండ్రి జ్ఞాపకాలతోనే ఇంకా ఉన్నారన్నది వారి మొహంలో బాధ చూస్తుంటే తెలుస్తుంది. అరవింద ఈవెంట్ స్టేజ్ మీద ఏడపోయినాడో.. అనే పాట వస్తున్నంత సేపు.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. అలాగే కళ్యాణ్ రామ్ స్పీచ్ లో తాత ఎన్టీఆర్ ని, నాన్న,హరికృష్ణ ని తలుచుకుని మాట్లాడి అందరి గుండెలని కదిలేంచేశాడు. కన్నీళ్లతో ఎన్టీఆర్ స్టేజ్ మీద అన్న కళ్యాణ్ రామ్ ని కౌగలించుకుని బాధపడడం చూసిన నందమూరి అభిమానులే కాదు.. సగటు ప్రేక్షకుడు కూడా కంటతడి పెట్టేసారు. ఇక ఎన్టీఆర్ అరవింద స్టేజ్ మీద చిత్ర బృందంలోని అందరి గురించి పేరు పేరునా ప్రస్తావించి.. తాను ఇలా నెలరోజులు షూటింగ్ చేసానంటే అది త్రివిక్రమ్ వల్లే జరిగిందని.. తండ్రిలా, అన్నలా, స్నేహితుడిలా తన వెన్నంటే ఉన్నాడని.. త్రివిక్రమ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పడమే కాదు.. తాను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుని 12 ఏళ్లు అయ్యిందని.. ఇప్పుడు ఈ కల నెరవేరిందని చెప్పాడు.

అభిమానులను ఉద్దేశించి…

నెల రోజుల క్రితం తమ ఇంట్లో జరిగిన విషాద సంఘటనను గుర్తు చేసుకుని స్టేజ్ మీద భోరున విలపించేసాడు ఎన్టీఆర్. తన తండ్రి మరణించి తమకి దూరమవ్వలేదని… అందరి మనసుల్లో ఉంటాడని.. ఆయన ఇక్కడే మన మధ్యనే ఉన్నాడని.. ఇంటి పెద్దని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో తనకి తెలుసనీ.. అలాగే తమ తండ్రి గారు చెప్పినట్టు.. ఈ జీవితం మీది.. మీకే అంకితం అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక అలా చెప్పి బాధతో అక్కడి నుండి వెళ్లిపోతూ… వెనుదిరిగి మళ్లీ వచ్చి నాన్నకి చెప్పలేకపోయినా ఒక మాట మీకు చెబుతామని.. ఇళ్లకి జాగ్రత్తగా వెళ్లండి.. ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసే కుటుంబం ఉంటుందని.. ఎవరూ రోడ్డు మీద ఒంటరిగా నిలుచుని బాధపడే పరిస్థితి తేవొద్దని అభిమానులకు ఎన్టీఆర్ ఏంతో బాధతో విజ్ఞప్తి చేసాడు. కన్నీళ్లతో బాధపడుతున్న ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ ఓదార్చాడు. ఇక ఎన్టీఆర్ బాధతో మాట్లాడలేని స్థితిలో దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని పట్టుకుని ఆత్మీయతను చాటాడు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*