ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ స్టోరీ ఇదే

NTR Trivikram

పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ చేసిన త్రివిక్రమ్.. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో విమర్శల పాలయ్యాడు. తర్వాత జరిగిన చాలా సినిమాల ఫంక్షన్స్ కి త్రివిక్రమ్ అటెండ్ అవ్వలేదు. తాను ప్రొడ్యూస్ చేసిన ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా ప్రొమోషన్స్ కి అటెండ్ అవ్వలేదు. ఎలాగైనా ఎన్టీఆర్ సినిమాతో కం బ్యాక్ అవ్వాలని స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్స్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాలంటే యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కలయికతో కూడినవిగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా యాక్షన్స్ సీన్స్ చాలానే ఉన్నాయి అంట. కాకపోతే యాక్షన్ అనేది ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడినదిగా ఉంటుందనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో జగపతిబాబు.. నాగబాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారట. రెండు కుటుంబాల మధ్య సాగే ఫ్యాక్షన్ పోరుగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో కనిపిస్తాడని.. తన పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ గతంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రభస సినిమాని ఇలానే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కథతోనే చేసాడు. కానీ రభస ఎన్టీఆర్ కి కావాల్సిన ఫలితం ఇవ్వలేదు. మరి ఈ సినిమా తో అయినా ఎన్టీఆర్ రభస చేసి హిట్ కొడతాడేమో చూద్దాం. ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పూజా హెగ్డే, ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*