పందెం కోడి 2 తెలుగులో మంచి రేట్..!

విశాల్

విశాల్ లేటెస్ట్ మూవీ పందెం కోడి 2 అక్టోబర్ 18న విడుదల కాబోతోంది. ఇందులో విశాల్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఈ సినిమాను తెలుగులో ఆఫిషల్ గా ఠాగూర్ మధు రిలీజ్ చేయబోతున్నారు. అయితే కరెక్ట్ గా ఈ సినిమాను ఎంతకు కొన్నాడో తెలియదు కానీ ఫిలింనగర్ సమాచారం ప్రకారం పది కోట్లుకు డీల్ కుదిరినట్టు తెలుస్తుంది. తెలుగు థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ అన్నీ కలిపి ఈ రేటు అని తెలుస్తోంది.

వరుస హిట్లతో పెరిగిన అంచనాలు

ఈ సినిమా మొదటి పార్ట్ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. ఇప్పుడు దానికి సీక్వెల్ అనగానే మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా ఈ మధ్య విశాల్ డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అభిమన్యుడు సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయింది తెలిసిన సంగతే. దాంతో పందెం కోడి 2 పై అంచనాలు జనాల్లో బాగానే ఉన్నాయి. మొదటి పార్ట్ ను రూపొందించిన లింగుస్వామినే ఈ సినిమాని కూడా రూపొందించాడు. ఇక తెలుగులో హిట్ అయిన టెంపర్ సినిమాను ఠాగూర్ మధు తమిళంలో విశాల్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల ఆగస్టు నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*