ఎందులకీ.. మార్పు

allu arjun

ఈమధ్యన పవన్ కళ్యాణ్ చాలా మారాడు. ఎప్పుడు సినిమా ఫంక్షన్స్ కి దూరంగా వుండే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రంగస్థలం సినిమా థియేటర్ లో చూడడమే కాదు… ఆ రంగస్థలం విజయోత్సవ వేడుకకి అతిధిగా వచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసాడు. అలాగే మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ నా పేరు సూర్య థాంక్స్ మీట్ కి హాజరవడమే కాదు.. అక్కడ అల్లు అర్జున్ ని పొగిడేసాడు. అలాగే నా పేరు సూర్య సినిమా చూస్తానని ఫ్యాన్స్ తోపాటు అల్లు అర్జున్ కి మాటిచ్చాడు. అక్కడ నుండి పవన్ నేరుగా మరో సినిమా ఈవెంట్ కి వెళ్ళాడు.

హీరో రవితేజ – కళ్యాణ్ కృష్ణ ల నెల టికెట్ సినిమా ఆడియో కి ముఖ్య అతిధిగా విచ్చేశాడు పవన్ కళ్యాణ్. ఇక ఆ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన పవన్ కళ్యాణ్, రవితేజ కి బూస్ట్ నిచ్చే మాటలు మాట్లాడాడు. అసలు ఒక హీరో హాస్యాన్ని పండిస్తున్నాడు అంటే.. అతని గుండెల్లో ఎంతో కొంత బాధ ఉంటుందని… అలాగే రవితేజ జీవితంలోను ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పిన పవన్… రవితేజ అంటే తనకెందుకు ఇష్టమో కూడా చెప్పాడు. రవితేజ హీరోగా ఎదగడం వెనుక అతని కృషి ఎంతో ఉంది. ఆ కృషిని అభినందిస్తున్నా. అసలు ఎంతమంది మధ్యలోనైనా సరే, రవితేజ సిగ్గుపడకుండా అవలీలగా నటించేస్తాడు. నేను అలా నటించలేను. అందుకే, రవితేజ నాకు స్ఫూర్తి.. అంటూ రవితేజను తన స్టయిల్లో పొగిడేసాడు పవన్ కళ్యాణ్.

మరి ఎప్పుడూ గుంభనంగా వుండే పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నట్టుండి.. మారిపోవడం మాత్రం ఒక్క ఫాన్స్ కి మాత్రమే కాదు అందరికి చాలా బావుంది. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఇలా ఆత్మీయుల కోసం కొద్దీ సమయం కేటాయించడం చూడముచ్చటగా ఉంటుంది కదూ..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*