పవన్ కు చెర్రీ సాహసోపేతమైన విషెస్ చెప్పాడు!
రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ మధ్య బాండింగ్ గురించి ప్రేత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలానే రామ్ చరణ్ పై తనకు ఎంత ప్రేమ ఉందో పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్ చెప్పాడు. అయితే ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
సర్ ప్రైజ్ ఉందని.....
నిన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అందులో.."బాబాయ్ నీకు 24 గంటల్లో ఓ సప్రైజ్ ఉంది ఈ బర్త్‌డే సందర్భంగా" అని ఓ వీడియో పోస్ట్ చేశాడు చెర్రీ. దాంతో మెగా అభిమానుల్లో ఆసక్తి కలిగింది. ఆ సప్రైజ్ ఏంటి?..ఏమైఉంటుంది? అని రకరకాలుగా చర్చ జరిగింది. అయితే ఈరోజు ఉదయం చెర్రీ వాటికి తేరా దించుతూ సాహసోపేతమైన పారాగ్లైడింగ్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన ఉపాసన చరణ్ తరుపున ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.
మీ ధైర్యమేనంటూ.....
‘ప్రియమైన బాబాయ్.. సినిమాల్లో.. జీవితంలో రిస్క్ చేసే ధైర్యాన్ని మీరు నాకిచ్చారు. అందుకే ఇది మీ కోసం. తొలిసారి పారాగ్లైడింగ్ చేస్తున్నా అంటూ చెర్రీ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం చెర్రీ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ కోసం చెర్రీ ఫారెన్ వెళ్ళాడు. అక్కడ పారాగ్లైడింగ్ చేసి తన ప్రియమైన బాబాయికి విష్ చేశాడు.