రంగస్థలం హిట్ ఒక ఎత్తైతే… ఇది ఇంకో ఎత్తు!

మెగా హీరో రామ్ చరణ్ కి రంగస్థలం హిట్ ఎంత ఎనేర్జిని తెచ్చిపెట్టిందో మాటల్లో వర్ణించలేనిది. తన రెండో సినిమా మగధీర తర్వాత అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చిట్టిబాబు గా తన కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మెన్స్ చేసాడు. చిట్టిబాబుగా ఊర మాస్ నటనను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. ఇటు చరణ్ కి రంగస్థలం తో ఎంత పెద్ద హిట్ దక్కిందో… అటు నిర్మాతలకు రంగస్థలం కాసుల వర్షం కురుస్తుంది. అసలు చెప్పాలంటే రామ్ చరణ్ కెరీర్ లోనే రంగస్థలం ఒక మైలు రాయిలా నిలిచిపోతుందనేది నిస్సందేహంగా చెప్పొచ్చు.

మరి చరణ్ రంగస్థలాన్ని కేవలం మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రమే కాదు ఇండస్ట్రీలోని పలువురు తెగ పొగిడేస్తున్నారు. నిన్నటికి నిన్న కాస్త లేట్ గా స్పందించిన… అల్లు అర్జున్ చిట్టి బాబు పాత్ర రామ్ చరణ్ తప్ప ఎవరూ చెయ్యలేరని… కొన్ని సినిమాలు కొందరికే సూట్ అవుతాయని.. అలాగే కేవలం నేటివిటీకి దగ్గరగా తమిళ్ వాళ్ళే కాదు మనం కూడా సినిమా తియ్యగలమని సుకుమార్ నిరూపించాడని.. అసలు తన కొడుకు రంగస్థలం పాట వింటేనే నిద్ర లేస్తున్నాడని స్పందించాడు. ఇక నిన్న సోమవారం రాత్రి రామ్ చరణ్, బాబాయ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన భార్య అన్న లేజ్నోవాతో కలిసి రంగస్థలం సినిమాని వీక్షించాడు.

ఇక సినిమా చూసిన తర్వాత ప్రెస్ తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా తర్వాత మళ్ళీ రంగస్థలం సినిమానే థియేటర్స్ లో చూడాలినిపించింది… రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. మైత్రి మూవీస్ వారు చాలామంచి సినిమా నిర్మించారు. దర్శకుడు సుకుమార్ రాసిన కథ గొప్పగా ఉంది. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్న అద్భుతమైన కథ. నా మనసుకు విపరీతంగా నచ్చిన సినిమా ఇది. ఇక ఇప్పటికి ఈ విషయాలు చాలు. ఈ సినిమా గురించిన మిగతా విషయాలు సక్సెస్ మీట్ లో మాట్లాడదామని నిర్ణయించుకున్నా అంటూ రంగస్థలం సక్సెస్ మీట్ కి తానొస్తున్నట్టుగా అందరికి హింట్ ఇచ్చేసాడు. మరి రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి బాబాయ్, పిన్నిలతో రంగస్థలాన్ని చూసాడు. రామ్ చరణ్ కి రంగస్థలం సినిమా హిట్ ఒక ఎత్తైతే…. బాబాయ్ తన సినిమా చూసి మెచ్చుకోవడం మరో ఎత్తు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*