పవన్ ఫోన్ నాట్ రీచబుల్ అంట!!

vakeel saab

పవన్ కళ్యాణ్ ఏపీ పరీక్షల రద్దు మీదున్న ఇంట్రెస్ట్ సినిమాల మీది లేనట్టుగా ఉంది. ఏపీ టెన్త్ పరీక్షల రద్దు కోసం కోసం ఏపీ ప్రభ్యత్వాన్ని డిమాండ్ చేసాడు పవన్. కరోనా టైం లో పరిక్షల నిర్వహణ ప్రమాదకారం అంటూ పరీక్షల ఉద్యమం చేపట్టాడు. ఏపీ ప్రభుత్వం ఎలాగోలా 10 పరీక్షలు రద్దు చేసింది. దానితో ప్రభుత్వానికి కృతఙ్ఞతలు చెప్పిన పవన్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ని రద్దు చేయమంటూ మరో గళం ఎత్తాడు. పవన్ కి – ఎగ్జామ్స్ కి పడదేమో అంటూ పవన్ అంటే గిట్టని వారు సైటర్లు వేస్తున్నారు. అయితే రాజకీయాల మాట అటుంచి.. ప్రస్తుతం పవన్ సినిమాల విషయంలో ఎవరికీ ఫోన్ లో దరకడం లేదట.

ముందు వకీల్ సాబ్ పని చూద్దాం తర్వాతే మరేదన్న ప్రాజెక్ట్ అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ అటు వకీల్ సాబ్ టీం ఫోన్స్ కూడా ఎత్తడం లేదట. అందుకే ఇపుడు అందరూ పవన్ ఫోన్ లో దొరకడం లేదు. పవన్ ఫోన్ నాట్ రీచబుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ ని ఎలాగైనా దిల్ రాజు దసరా బరిలో నిలపాలని చూస్తుంటే.. పవన్ మాత్రం నిర్మాతల ఫోన్స్ కి రెస్పాండ్ అవడం లేదట. మరి రీ ఎంట్రీ అన్నప్పుడు  సినిమాల మీద సినిమాలకు సైన్ చేసి నిర్మాతలను లాక్ చేసుకున్న పవన్ కళ్యాణ్ కి ఇపుడు కరోనా భయం పట్టుకుంది.. అందుకే షూటింగ్స్ విషయంలో పెదవి విప్పడం లేదు అంటున్నారు. ముందే కరోనా ఉదృతి తగ్గాక వకీల్ సాబ్ సెట్స్ మీదకి వస్తా.. అది కూడా జులై లోనే అని చెప్పిన పవన్ జులై దగ్గరకొచ్చిన ఫోన్స్ లిఫ్ట్ చెయ్యడం లేదంటే.. మనోడికి అప్పుడే సినిమా సెట్స్ మీదకెళ్లే ఉద్దేశ్యం ఉండకపోవచ్చు. కరోనా తో పెట్టుకోవడమెందుకు.. అది తగ్గాక చూద్దాంలే అన్నట్టుగా ఉంది పవన్ ప్రవర్తన.

Ravi Batchali
About Ravi Batchali 33873 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*