పవన్ కరోనాని అలా వాడేస్తున్నాడా?

Pawan Kalyan

ప్రస్తుతం కరోనా తో దేశం మొత్తం ఇంట్లోనే కూర్చున్నారు. సీలెబ్రిటీస్ కాదు.. సామాన్య జనం ఎవరైనా ఇంటికే పరిమితమవుతున్నారు. కేవలం పోలీస్ లు, డాక్టర్స్, పారిశుధ్య కార్మికులు తప్ప మిగతా వారంతా ఇంట్లోనే ఉండిపోతున్నారు. అయితే హీరోలు చాలామంది వంటలు గింటలు అంటూ ఏవో ప్రయత్నాలు చేస్తుంటే.. హీరోయిన్స్ మాత్రం జిమ్ వర్కౌట్స్ తో హాట్ హాట్ గా ఇంట్లోనే తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కరోనా టైం ని అటు రాజకీయాల్తోనూ ఇటు సినిమా పనులతోను కానిచ్చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. కానీ కరోనాతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు కాబట్టి వకీల్ సాబ్ లో తన పాత్రకి సంబందించిన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట. దానికి సంబందించిన డబ్బింగ్ ఎక్విప్మెంట్ అంతా ఇంటికే తెప్పించుకుని అసిస్టెంట్ డైరెక్టర్న్ సహాయంతో పవన్ కళ్యాణ్ తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడట, ఇక కరోనా టైం పూర్తి కాగానే మల్లి మిగతా షూటింగ్ కూడా పూర్తి చేస్తాడట. మరోపక్క హరీష్ స్క్రిప్ట్ ఫోన్ లోనే విని ఓకె చేస్తున్నాడట. ఎమన్నా మార్పులు చేర్పులు కూడా హరీష్ కి ఫోన్ లోనే సూచిస్తున్నాడట పవన్ కళ్యాణ్. మరోపక్క వేణు శ్రీరామ్ కూడా ఎడిటింగ్, మిగతా పాత్రల డబ్బింగ్ పనులను చూసుకుంటున్నాడట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*