‘బుల్ రెడ్డి..’ పాటలో పాయల్

payal rajput

`ఆర్ఎక్స్ 100` చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న `సీత‌` చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించారు. సినిమా క‌థానుసారం కీల‌క స‌మ‌యంలో `బుల్ రెడ్డి… ` అంటూ సాగే ఈ స్పెష‌ల్ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ స‌హా అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది. ఈ సాంగ్ రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు విడుద‌లవుతుంది. ఈ సాంగ్‌లో పాయ‌ల్ సోలో పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిల‌వ‌నుందట. సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ 2.5 మిలియ‌న్ వ్యూస్‌తో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ ను రాబ‌ట్టుకుంది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్‌గా ట్రేడ్ వ‌ర్గాల్లో బిజినెస్ డీల్స్ కూడా పూర్త‌య్యాయి. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*