పూజ హెగ్డే ది పెద్ద మనసు

పూజా హెగ్డే

సినిమాలు అయితే చేస్తుంది కానీ దానికి ఫలితంమే రావడం లేదు. టాలీవుడ్ లో పూజ హెగ్డే నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ అవి ఏమి సక్సెస్ కాలేకపోయాయి. ఆమె చేసిన సినిమాల్లో ఒక ‘దువ్వాడ జగన్నాధమ్‌’ యావరేజ్ అనిపించుకుంది. మిగతా సినిమాలన్నీ తుస్ మనిపించాయి. ప్రస్తుతం ఆమె బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘సాక్ష్యం’ చిత్రంలో నటించింది. ఇది త్వరలోనే రిలీజ్ కాబోతుంది.

అయితే ఆమె ఈ సినిమాకు భారీగా పారితోషకం అందుకుందంట. మాములుగా తీసుకునే దానికన్నా డబుల్‌ అడిగినా కానీ నిర్మాత ఓకే అనేసారు అంట. యూత్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉండటంతో నిర్మాతలు ఆమె అడిగిన దానికి ఒకే చేశారంట. ప్రొమోషన్స్ విషయంలో సమయం కేటాయించడానికి పూజ సై అంటుందంట.

సాధారణంగా హీరోయిన్స్ ప్రొమోషన్స్ చేయాలంటే ఎక్స్ట్రా గా వసూల్ చేస్తారు.. కానీ పూజ అవిఏమి తీసుకోకుండా ప్రొమోషన్స్ కి రెడీ అంటుందంట. ఏది అయితేనేం ప్రొడ్యూసర్స్ కు లాభమేగా. ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ – వంశీ సినిమా…ఎన్టీఆర్ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*