అవకాశాలు ఎలాగున్నా తాను మాత్రం తగ్గనంటుంది

రష్మిక మందన్న Pooja Hegde

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరయ్యా.. అంటే వెంటనే డీజే భామ పూజ హెగ్డే అని అరుస్తున్నారు. అంతలా పూజ హెగ్డే పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. ప్రస్తుతం ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న పూజ హెగ్డే తాజాగా యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన చేసిన సాక్ష్యం సినిమాలో నటించింది. సాక్ష్యం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ లోకి దిగింది. గత రాత్రి సాక్ష్యం ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పూజ హెగ్డే డ్రెస్ సెన్స్ చూస్తే అబ్బా అనిపిస్తుంది. లాంగ్ గౌన్ లో మెరిసిన పూజ హెగ్డే క్లివేజ్ అందాలతో… అందరి చూపుని తన మీద పడేలా చేసుకుని అందులో 100 పెర్సెంట్ సక్సెస్ అయ్యింది కూడా. గత రాత్రి పూజ వేసిన డ్రెస్ మీదే అందరి చర్చ. ఆ డ్రెస్ లో పూజ అందాలు అద్భుతంగా అదరహో అనేలా వున్నాయి. లైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో పూజ ని అలా చూస్తుంటే అబ్బా ఈ అమ్మాయి అందాలు మనం మూడు సినిమాల్లో చూసి పండగ చేసుకోవచ్చు అంటూ కుర్రకారు గుటకలు మింగుతున్నారు.

డీజే లో పూజ వేసిన బికినీ ఫ్లాట్ తో దర్శక నిర్మాతలు ఆమెకి వరసగా స్టార్ హీరోల సినిమా ల్లో అవకాశాలిచ్చారు. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు ఒక రేంజ్లో మార్మోగుతుంది. మరి ఒకే ఒక్క బికినీ కే ఇలాంటి అవకాశాలు వస్తే…. పూజ మాత్రం సైలెంట్ గా ఎందుకుంటుంది . అందుకే అవకాశాలు ఎలా వున్నా తాను మాత్రం తగ్గనని డిసైడ్ అయ్యింది. తనకున్న బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోపక్క హాట్ హాట్ డ్రెస్సులతో పూజ హెగ్డే నిత్యం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. బికినీ కానివ్వండి, లాంగ్ డ్రెస్ కానివ్వండి పూజ మాత్రం ఎక్కడా తగ్గకుండా అందాలు ఆరబోస్తుంది. నిజంగా పూజ ఇలా ఇంత గ్లామర్ షో చేస్తే మాత్రం అమ్మడుకి ఇక అవకాశాలే అవకాశాలు. వచ్చే రెండేళ్లలో పూజ మాత్రం టాప్ చైర్ నుండి దిగే అవకాశం అయితే లేదు. ఆ ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఏ రెండు హిట్ అయినా అమ్మడు జాతకమే మారిపోతుంది. దెబ్బకి స్టార్ హీరోయిన్స్ కి చుక్కలు చూపెడుతుంది. ప్రస్తుతం ఇప్పటికే పూజ దెబ్బకి స్టార్ హీరోయిన్స్ విలవిలలాడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*