ప్రభాస్ కి బాలీవుడ్ అంటే అంతిష్టమా?

బాహుబలి తో ఒక్కసారైనా ఇంటెర్నేషనల్ స్టార్ అయ్యాడు ప్రభాస్. తెలుగులో ప్రభాస్ కి అనేక సూపర్ హిట్ సినిమాలున్నప్పటికీ… బాహుబలితో ప్రపంచాన్ని చుట్టేశాడు. అయితే ప్రభాస్ కి ఇప్పుడు బాలీవుడ్ మీద బాగానే గాలి మళ్లింది. మరి ఇండియాలో బాలీవుడ్ కున్న క్రేజ్ మరే భాషకి లేదు. అందుకేనేమో ప్రభాస్ బాలీవుడ్ బోలెడంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న సాహో చిత్రం విషయంలోనూ ఎక్కువగా బాలీవుడ్ నే టార్గెట్ చేసాడు. అందుకే ఆ సినిమాలో నటించే నటీనటులను టెక్నీషియన్స్ ని ఎక్కువగా బాలీవుడ్ నుండే ఎంపిక చేశారు. సాహో సినిమా మొత్తం బాలీవుడ్ నటీనటులే. అయితే సాహో చిత్రానికి బాలీవుడ్ లో బోలెడంత బజ్ ఉంది.

తాజాగా సాహో ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్నప్పుడు… మీకిష్టమైన హీరోయిన్స్ ఎవరని అడగ్గానే… ప్రభాస్ కి ఒక్క టాలీవుడ్ హీరోయిన్ కూడా గుర్తుకు రాలేదంటే ప్రభాస్ కి బాలీవుడ్ అంటే ఎంత ఇదో చెప్పకనే చెబుతుంది. అయితే ఆ ఇంటర్వ్యూ లో తనకిష్టమైన ముగ్గురు హీరోయిన్స్ ని ప్రభాస్ బాలీవుడ్ నుండే తీసుకున్నాడు. తనకి ఇష్టమైన హీరోయిన్స్ దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, అలియా భట్ లు అని చెప్పి షాకిచ్చాడు. మరి ప్రభాస్ కి బాలీవుడ్ హీరోయిన్స్ అంటే ఎంతిష్టమో కదా. తన పక్కన నటించిన ఒక్క హీరోయిన్ పేరు కూడా ప్రభాస్ చెప్పలేదు.. కానీ ప్రభాస్ నోటి వెంట తనకిష్టమైన హీరోయిన్స్ లిస్ట్ లో స్వీటీ అదేనండి అనుష్క పేరొస్తుందేమో అని సదరు యాంకర్ చాలా ఆసక్తిగా ఎదురు చూసారు.. కానీ ప్రభాస్ మాత్రం తనకి దీపికా, అలియా, కత్రినా అని చెప్పేసరికి షాకవ్వడం యాంకర్ వంతైంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*