అప్పుడు బాహుబలి… ఇప్పుడు సాహోనా బాబూ

telugu post telugu news

ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్ళికొడుకు ఎవరయ్యా అంటే టక్కున ప్రభాస్ అంటారు. ప్రభాస్ పెళ్ళేమో కానీ సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి విషయంలో అనేకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ అనుష్కలు ప్రేమించుకున్నారు కాబట్టే ప్రభాస్ బయట అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదని ఒకేసారి… అనుష్క ఇంట్లో ప్రభాస్ ఇంట్లో ఒప్పుకోవడమే ఆలస్యం వారి పెళ్లి జరుగుతుందని మరోమారు వార్తలొచ్చిన వాటినే ప్రభాస్ అండ్ అనుష్కలు ఖండించారు. కానీ ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ అయితే పడలేదు. అయితే గత రేండు రోజులుగా అనుష్క పెళ్లి టాపిక్ సోషల్ మీడియా లో వినబడుతుంది.

ఈ ఏడాది అనుష్క పెళ్లి జరగబోతుందని… అందుకే ఆమె తల్లితండ్రులు అనుష్క ని తీసుకుని హిమాలయాలకు వెళ్లి అనుష్క పెళ్ళికి ఎదురవుతున్న ఆటంకాలు పూజలు జరిపించారని న్యూస్ మాములుగా హైలెట్ అవలేదు. అయితే అనుష్క పెళ్లి వార్తలను ఖండించలేదు. తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ప్రభాస్ కోసం అయన పెదనాన్న భీమవరం అమ్మాయిని చూశాడని… ప్రభాస్ ఒకే చెబితే పెళ్లి ఫైనల్ అనే టాక్ వినబడుతుంది.అయితే ప్రభాస్ కూడా పెళ్లి కి సుముఖంగా ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. కానీ ప్రభాస్ ఈ పెళ్లి కి ఒక కండిషన్ తన పెదనాన్న కృష్ణం రాజుకి పెట్టినట్లుగా చెబుతున్నారు.

ప్రభాస్ తన పెళ్లి విషయం సాహో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు ఆగమని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి గతంలోనే ప్రభాస్ తన పెళ్లి విషయంలో బాహుబలి సినిమా అయ్యే వరకు చేసుకోనని భీష్మించుకుని కూర్చుని ఐదేళ్లు అందరిని వెయిట్ చేయించాడు. మరి బాహుబలి అయ్యి కూడా ఏడాది పైనే ఆయ్యింది.కానీ ప్రభాస్ మళ్ళీ పెళ్లి ని వాయిదా వేసాడు. అప్పుడు బాహుబలి అని ఇప్పుడు సాహో ఫినిష్ అవ్వాలంటున్నాడు.మరి సాహో ఫినిష్ కావడానికి ఇంకా ఏడాది పడుతుంది. మరి అప్పటివరకు ప్రభాస్ పెళ్లి కోసం ఫాన్స్ వెయిట్ చెయ్యక తప్పేలా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*